అంతర్జాతీయం

బ్రెగ్జిట్‌కు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రసెల్స్, నవంబర్ 25: చరిత్రాత్మక బ్రెగ్జిట్ ఒప్పందాన్ని యూరోపియన్ యూనియన్ నాయకులు ఆదివారం ఆమోదించారు. నాలుగు దశాబ్దాల తరువాత యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని ఒక నాయకుడు ‘విషాదం’గా అభివర్ణించారు. బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే లేకుండానే యూరోపియన్ యూనియన్‌కు చెందిన 27 మంది నాయకులు ఆదివారం సమావేశమయి, బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమోదించారు. దీంతో మార్చి 29న ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడానికి రంగం సిద్ధమయింది. ‘బ్రిటన్ వైదొలిగే ఒప్పందాన్ని, భవిష్యత్తులో ఈయూ-యూకే సంబంధాలపై రాజకీయ ప్రకటనను ఈయూ-27 ఆమోదించింది’ అని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. అంతకు ముందు థెరిసా మే ఈయూ శిఖరాగ్ర సమావేశానికి వస్తారని వారు వేచిచూశారు. యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగమయిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లౌడ్ జుంకర్ బ్రసెల్స్‌లో జరిగే ప్రత్యేక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వస్తూ దీనిని ‘విచారకరమయిన దినం’గా అభివర్ణించారు. ‘గ్రేట్ బ్రిటన్ వంటి ఒక దేశం యూరోపియన్ యూనియన్‌ను వీడుతుండటం సంతోషించదగినదో, ఉత్సవాలు జరుపుకోగలిగినదో కాదు. ఇదో విచారకరమయిన వేళ. ఇదో విషాదం’ అని ఆయన అన్నారు.