అంతర్జాతీయం

అవును.. మాపనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్/వాషింగ్టన్, డిసెంబర్ 8: ముంబయి పేలుళ్ల సూత్రధారులు, నిందితుల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారు పాకిస్తాన్‌లో ఉన్నట్లు దీంతో ఇమ్రాన్ ఖాన్ అంగీకరించినట్లయింది. భారత్‌తో శాంతి కావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. టెర్రరిజానికి పాల్పడిన వారిని ప్రాసిక్యూట్ చేయాలని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని పరిష్కరించాలనే తాపత్రయంతో పాకిస్తాన్ ఉందన్నారు. ఈ కేసును విచారిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో కేసు స్థితి గురించి వివరాలు అడిగినట్లు ఆయన చెప్పారు. వాషింగ్టన్ పోస్టుకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ, ముంబయి దాడులకు బాధ్యులైన వారి విషయంలో చర్యలు తీసుకోక తప్పదన్నారు. కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. ఈ కేసులో నిందితుడైన లష్కరీ కమాండర్ జకీ ఉర్ రెహమాన్ లక్వీను విడుదల చేయడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విధంగా అన్నారు. ఏడుగురు వ్యక్తులపైన కేసు విచారణ జరుగుతోందన్నారు. పదేళ్లుగా కేసు నత్తనడకన సాగుతోంది. వీరు దాడికి సూత్రధారులంటూ భారత్ కీలకమైన ఆధారాలను పాకిస్తాన్‌కు ఇచ్చింది. లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సరుూద్‌ను అరెస్టు చేసి శిక్షించాలని భారత్ కోరుతోంది. ఉగ్రవాదం, చర్చలు కలిసి ప్రయాణం చేయలేవని భారత్ అనేకసార్లు స్పష్టం చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత భారత్‌తో చర్చలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల తర్వాత చర్చలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.