అంతర్జాతీయం

మైన్మార్ రైతులకు మొబైల్‌యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నే పి తావ్, డిసెంబర్ 12: మైన్మార్ రైతుల కోసం రూపొందించిన మొబైల్ యాప్‌ను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఇక్కడ ఆవిష్కరించారు. వ్యవసాయ పరిశోధనలు, విద్యకు సంబంధించి అనేక అంశాలు యాప్‌లో పొందుపరిచారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని రాష్ట్రపతి స్పష్టం చేశారు. గ్రీన్‌వే పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ మైన్మార్‌లో లక్ష మంది రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి సమగ్ర సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం, సాగు పద్ధతలు, పంటల వివరాలన్నింటీని యాప్‌లో పొందుపరిచినట్టు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్‌కుమార్ వెల్లడించారు. యెజెన్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్రపతి ఆవిష్కరించారని ఆయన తెలిపారు. జన్యు శాస్త్రం, పంటల సాగు, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో యాప్ రూపొందించారని, దానికి భారత్ సహాయ, సహకారాలు అందించిందని కుమార్ పేర్కొన్నారు. యెజెన్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘రైస్ బయో పార్క్’ను రాష్టప్రతి కోవింద్ ప్రారంభించారు. ఎంఎస్ స్వామినాథన్ పరిశోధనా సంస్థ సహకారం అందించిందని ఆయన తెలిపారు. ‘మా అనుభవాలు మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు చేపట్టిన ఈ కార్యక్రమం విజయంవంతం కావాలని కోరుకుంటున్నా’అని కోవింద్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి కోవింద్, సవిత దంపతులకు యాంగావ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. యాంగావ్ ముఖ్యమంత్రి ఫో మిన్ తైన్, ఉన్నతాధికారులు కోవింద్‌కు స్వాగతం పలికారు.

చిత్రం..నే పి తావ్ (మైన్మార్)లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన
అడ్వాన్డ్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఏసీఏఆర్‌ఈ) కేంద్రాన్ని
బుధవారం దర్శించిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన భార్య సవిత