అంతర్జాతీయం

నిన్న సునామీ.. నేడు నీటికి కటకట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా (ఇండోనేషియా), డిసెంబర్ 25: అగ్నిపర్వతం పేలి సంభవించిన సునామీ రాకాసి అలలతో ఇండోనేషియా కోస్తా తీరం కార్తియా పట్టణం కకావికలమైంది. సునామీ బాధితులకు కనీస అవసరాలు అందకపోవడంతో హాహాకారాలు మిన్నంటుతున్నాయి. తాగేందుకు పరిశుద్ధమైన నీటి లభ్యత లేదు. రోగాలబారినపడిన వారికి మందులు లేవు. వేలాది మందికి ఆశ్రమం కల్పించినా, అక్కడ కనీస సదుపాయాలు కొరవడ్డాయి. పునరావాస సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. గుక్కెడు మంచి నీళ్లు అడిగినా ఇచ్చే వాళ్లు లేరు. ప్రజలు ఆకలితో నకనకలాడుతున్నారు. ఎక్కడ చూసినా ప్రజల సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రజారోగ్య వ్యవస్థ క్షీణించింది. వేలాది మంది ప్రజలు ఇళ్లు వదిలి రోడ్లపైకి వచ్చారు. పిల్లలు, పెద్దలు జ్వరాల బారినపడ్డారు. ఒక వైపు చలి, మరో వైపు ఆకలి తమను కబళిస్తున్నాయని వృద్ధులంటున్నారు. దక్షిణ సుమత్రా, పశ్చిమ జావా ప్రాంతాల మధ్య తీరంలో ఉన్న కార్తియా పట్టణంపై సునామీ విరుచుకుపడిన విషయం విదితమే. తాజా అంచనాల ప్రకారం 429 మంది మరణించారు. 1459 మంది గాయపడ్డారు. 128 మంది గల్లంతయ్యారు. ఐదు వేల మంది ఇండ్లను వదిలి కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చారు. ఇంకా కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. బీచ్ పక్కనే ఉన్న ఇంటిని వదిలి మూడు రోజలైంది. ఒక పాఠశాలలో తలదాచుకున్నాం. పిల్లలకు, భర్తకు జ్వరం, మందులు లేవు. పరిస్థితులు దారుణగా ఉన్నాయని అబూ సలీమా అనే యువతి చెప్పారు. సుమత్రా దీవికి సమీపంలో సంభవించిన సునామీ వల్ల అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి. అక్కడి పరిస్థితిని ప్రభుత్వ సిబ్బంది మదింపు వేస్తున్నారు. ప్రభుత్వ ప్రతినిధి సుటోపో పూర్వో నుగ్రాహో మాట్లాడుతూ, సహాయక బృందాలను పంపామని, యుద్ధప్రాతిపదికపై ప్రజలకు ఆహారం, నీరు, మందులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. గత ఆరు నెలలలో సునామీ రావడం మూడోసారి అని చెప్పారు. ఇండోనేషియాను తరచుగా సునామీ ముంచెత్తుతుంటుంది. ప్రపంచ దేశాల సహకారం, స్వచ్చందసేవాసంస్థల తోడ్పాటుతో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు ఆయన చెప్పారు.
ప్రకృతి ప్రకోపానికి తల్లడిల్లుతున్న ఇండోనేసియాలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. సునామీ ధాటికి తుడిచిపెట్టుకుపోయిన పశ్చిమ జావా, దక్షిణ సుమత్రా దీవుల్లోని శకలాలను తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మిలిటరీ దళాలు, ప్రభుత్వ సిబ్బందితోపాటు స్వచ్ఛంద సేవాదళాల కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. శనివారం రాత్రి అగ్నిపర్వతం నిప్పులు వెదజల్లుతూ బద్దలుకావడం.. ఆ ప్రభావంతో సముద్రంలో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి సునామీ ఏర్పడిన విషయం తెలిసిందే.
చిత్రం..సునామీ ధాటికి మరుభూమిని తలపిస్తున్న ఇండోనేసియా సుంబేర్ జయా గ్రామం