అంతర్జాతీయం

కెన్యాతో ఏడు ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైరోబీ, జూలై 11: భారత్ కెన్యాల మధ్య వ్యాపార సంబంధాలు బలోపేతం చేసుకోవటంలో భాగంగా ద్వంద్వ పన్ను విధానాన్ని రద్దు చేస్తూ ఇరు దేశాల మధ్య సోమవారం ఒక ఒప్పందం కుదిరింది. దీంతోపాటు మరో ఆరు ఒప్పందాలపైనా రెండు దేశాలూ సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్రికాదేశాల పర్యటనలో భాగంగా సోమవారం కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 44.95 మిలియన్ డాలర్ల రాయితీతో కూడిన రుణాన్ని కెన్యాకు ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. కెన్యాలో ప్రజారోగ్యం మెరుగు కోసం అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు మోదీ తెలిపారు. ఇందులో భాగంగా కెన్యాలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. రక్షణ, భద్రత రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకార ఒప్పందాలు జరిగాయి. వీటితోపాటుగా సైబర్ సెక్యూరిటీ, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు సంబంధించిన అంశాల్లో ఇరుదేశాలూ సహకరించుకునేందుకు ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా సముద్రతీర రక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. ‘‘ఇరు దేశాల మధ్య బహుముఖ అభివృద్ధికారక భాగస్వామ్యాన్ని పెంపొందించటం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలకు మూలం’’ అని మోదీ అన్నారు. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో అనుభవాలను, నైపుణ్యాన్ని కెన్యాతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ అన్నారు. కెన్యాలో జౌళి కర్మాగారాన్ని ఆధునీకరించేందుకు 15మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని కూడా మోదీ ప్రకటించారు. కెన్యాలో తీసుకున్న నిర్ణయాలు అమలు తీరును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని కూడా మోదీ హామీ ఇచ్చారు. ‘‘కెన్యా భారత్‌కు విలువైన స్నేహితుడే కాదు, విశ్వసనీయమైన భాగస్వామి కూడా. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు దీర్ఘకాలికమైనవి’’ అని మోదీ అన్నారు. తమ దేశ అభివృద్ధికోసం భారత్ స్నేహహస్తం అందించటం పట్ల కెన్యా అధ్యక్షుడు ఉహురు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం.. కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టాతో నరేంద్ర మోదీ