అంతర్జాతీయం

ఆర్థికంగా ధ్వంసం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 14: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు. ప్రత్యర్థులనే కాకుండా నాటో దేశాలను ఇరుకున పడేస్తున్న ఆయన తాజాగా టర్కీపై నిప్పులు చెరిగారు. సిరియాలోని అమెరికా మద్దతుతో పనిచేస్తున్న కురుధ్ సైనిక దళాలపై టర్కీ దాడి చేస్తే దానిని ఆర్థికంగా ధ్వంసం చేస్తామని ట్రంప్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సిరియా నుంచి అమెరికా దళాలు వైదొలగిన నేపథ్యంలో అక్కడి కుర్ద్ దళాలపై టర్కీ దాడి చేసే అవకాశం ఉందన్న కథనాలపై ట్రంప్ స్పందించారు. అయితే, ఈ హెచ్చరికను టర్కీ తిరస్కరించింది. ఉగ్రవాదులకు వ్యితిరేకంగా తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సిరియాలో ఉన్న 2 వేల మంది అమెరికా దళాలను ఉపసంహరిస్తున్నట్టు ట్రంప్ ఇటీవల చేసిన ఆకస్మిక ప్రకటన నాటో దేశాలను కలవరపాటుకు గురిచేసింది. గత వారం నుంచే సిరియా నుంచే అమెరికా దళాల ఉపసంహరణ మొదలైంది. ఇప్పటివరకు అమెరికా మద్దతుతో ఉన్న కుర్ద్ దళాలకు ఈ పరిస్థితి మింగుడుపడనిదిగా మారింది. అమెరికా దన్ను లేదు కాబట్టి టర్కీ తమపై దాడి చేసే అవకాశం ఉందంటూ ఈ కుర్ద్ అనుకూల పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, అమెరికా అభిప్రాయం ఎలా ఉన్నా కుర్ద్ దళాలను తాము ఉగ్రవాదులుగానే పరిగణిస్తున్నామని, తమ దేశంలోని వేర్పాటువాదులకు వీటినుంచి మద్దతు అందుతోందని టర్కీ చెబుతోంది. ఈ దళాల నుంచి తమకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా దాడి చేస్తామని టర్కీ అధ్యక్షుడు స్పష్టం చేయడంతో ట్రంప్ తాజా హెచ్చరిక జారీ చేశారు.