అంతర్జాతీయం

బ్రిటన్ చరిత్రలో అధికార పార్టీకి పరాభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 16: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ప్రతిపాదన ఒప్పందాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ తిప్పిగొట్టింది. బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా అవమానకరరీతిలో ప్రధాని మే ప్రతిపాదనను 432 మంది సభ్యులు తిరస్కరించగా, అనుకూలంగా 202 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రధాని థెరిసా మే ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఆధునిక చరిత్రలో తొలిసారిగా అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికి ఈ స్థాయిలో పరాభవం ఎదురుకాలేదు. బ్రెగ్జిట్ డీల్‌ను హౌస్ ఆఫ్ కామన్స్ వ్యతిరేకించడంతో, లేబర్ పార్టీ నేత జెర్మీ కార్బీన్ విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని ప్రతిపక్ష నేతలు బలపరిచారు. బుధవారం తర్వాత ఈ అంశంపై ఓటింగ్ జరగనుంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న నిర్ణయాన్ని బ్రెగ్జిట్‌గా నామకరణం చేసిన విషయం విదితమే. బ్రెగ్జిట్ డీల్ ఓటమి చెందడంతో ప్రధాని థెరిసా మే ప్రభుత్వం ఖంగు తింది. ఈ ఓటమిని పెద్ద విపత్తుగా లేబర్ పార్టీ నేత జెర్మీ కార్బీన్ అభివర్ణించారు. బ్రెగ్జిట్ డీల్‌కు ఓటమి ఎదురైందని, ఇదొక పనికిమాలిన నిర్లక్ష్యంతో కూడిన ప్రతిపాదన అని ఆయన అన్నారు. యూరోపియన్ యూనియన్‌లో 28 దేశాలు ఉన్నాయి. ఈ డీల్‌ను హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదించినట్లయితే మార్చి 29వ తేదీన బ్రిటన్ వైదొలగాల్సి ఉండేది. 1973 మార్చి 29వ తేదీన యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ చేరింది. గత రెండేళ్లుగా బ్రెగ్జిట్ డీల్ ఆమోదం కోసం ప్రధాని థెరిసా మే అన్ని ప్రయత్నాలు చేశారు. ఒక వైపు బ్రెగ్జిట్ డీల్ నుంచి వైదొలగడం, మరోవైపు బ్రిటన్ ఆర్థికాభివృద్ధి కోసం ప్రణాళిక, రాజకీయ తీర్మానం చేయాలని ప్రధాని థెరిసా మే భావించారు. పార్లమెంటులో అన్ని పార్టీలు ప్రధాని ప్రతిపాదనను తిప్పిగొట్టారు. గత డిసెంబర్‌లో తన సొంత పార్టీ నుంచి అవిశ్వాసతీర్మానం ఎదురుకాగా, ఆమె నెగ్గారు. ప్రత్యామ్నాయ ప్రణాళికతో కామన్స్ సభకు వచ్చే వారం ప్రధాని థెరిసా మే వస్తారని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి. హౌస్ చెప్పిన మాటను ప్రభుత్వం విన్నదని అధికారులు చెప్పారు. ప్రస్తుతం భవిష్యత్తుపై అన్ని పార్టీలతో ఆమె చర్చించనున్నారని చెప్పారు. కాగా విశ్వాసతీర్మానం పరీక్షలో థెరిసా మే గట్టెక్కవచ్చని బ్రిటన్ మీడియా అంచనావేస్తోంది.
చిత్రం..బ్రెగ్జిట్‌పై బ్రిటన్ ప్రధాని థెరెసా మే వైఖరికి నిరసనగా లండన్‌లోని
పార్లమెంట్ స్క్వేర్ వద్ద ‘బ్రెగ్జిట్ వ్యతిరేక’ దిష్టిబొమ్మను ప్రదర్శిస్తున్న నిరసనకారులు