అంతర్జాతీయం

మళ్లీ ట్రంప్, కిమ్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 19: అమెరికా, ఉత్తర కొరియాల మధ్య మరో కీలక శిఖరాగ్ర భేటీ జరగబోతోంది. ఉత్తర కొరియా అణ్వాయుధాలు, క్షిపణి కార్యక్రమాలను తొలగించడానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ల మధ్య ఫిబ్రవరి చివరి వారంలో ఈ సమావేశం జరగనున్నట్టు వైట్‌హౌస్ ప్రకటించింది. ఇద్దరి నాయకుల మధ్య గత ఏడాది జూన్ 12న సింగపూర్‌లో తొలి శిఖరాగ్ర భేటీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండో సమావేశం ఎక్కడ జరుగుతుందన్న దానిపై వైట్ హౌస్ నుంచి ఎలాంటి స్పష్టత రానప్పటికీ మీడియా కథనాల ప్రకారం వియత్నాం రాజధాని హనోయ్‌లో గానీ, ఆ దేశ తీర ప్రాంత పట్టణమైన డనాగ్‌లో గానీ ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉత్తర కొరియా రాయబారి కిమ్‌యాంగ్ శుక్రవారం జరిపిన సమావేశం నేపథ్యంలో ఈ తాజా శిఖరాగ్ర భేటీ మార్గం సుగమం అయింది. తొలి శిఖరాగ్ర భేటీలో తీసుకున్న నిర్ణయాలేవీ ముందుకు సాగకపోవడం, అనేక ప్రతికూల పరిస్థితులు తలెత్తడంతో ఈ రెండో భేటీ అనివార్యం అయింది.