అంతర్జాతీయం

అమెరికాలో అదే సీను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 25: అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ కొనసాగుతుండటంతో దేశంలో ప్రతిష్టంభన రోజురోజుకు పెరిగిపోతోంది. అధికార, విపక్షాలు దీనిపై పట్టుబడుతూ ఎవరూ మెట్టుదిగకపోవడంతో కనుచూపుమేర పరిష్కారం కన్పించడం లేదు. అమెరికా-మెక్సికో సరిహద్దు వెంబడి 5.7 యూఎస్ బిలియన్ డాలర్లతో గోడకట్టాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని సెనేట్‌లు విభేదించడం, వారు అంగీకరించకపోతే ఏ బిల్లులూ ఆమోదించమని ట్రంప్ భీష్మించిన నేపథ్యంలో దేశంలో పాక్షిక షట్‌డౌన్ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవు. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా 8 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు గత ఏడాది డిసెంబర్ 22 నుంచి జీతాలు లేకుండానే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై గురువారం జరిగిన ఓటింగ్‌లో సైతం రిపబ్లికన్ పార్టీ విఫలమైంది. 50-47 ఓట్లతో వారు పెట్టిన తీర్మానం వీగిపోయింది. ఈ విషయంలో డెమోక్రాట్‌కు చెందిన సెనేటర్ జో మంచిన్, రిపబ్లిక్‌కు చెందిన టామ్ కాటన్, మైక్ లీ తమ సొంత పార్టీలతో విభేదించారు. అయితే తాత్కాలిక షట్‌డౌన్‌కు స్వస్తి పలికి ఫెడరల్ ఏజెన్సీలను తాత్కాలికంగా మూడు వారాల పాటు తెరవాలన్న విషయంపై ఇరు పార్టీల మధ్య చర్చలు జరిగినా సానుకూల నిర్ణయం జరగలేదు. అనంతరం ట్రంప్ వైట్‌హౌస్‌లో విలేఖరులతో మాట్లాడుతూ సరిహద్దు వద్ద గోడను నిర్మించడానికి తొలివిడత నిధులు మంజూరు చేస్తేనే తాను బిల్లుపై సంతకం చేస్తానని మరోసారి ప్రకటించారు. గోడ నిర్మాణానికి మొదటి విడతగా నిధులు విడుదల చేసిన తర్వాతే ఏ నిర్ణయమైనా అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ స్పష్టం చేయగా, ట్రంప్ చేస్తున్న వినతి ఏమాత్రం సబబుగా లేదని స్పీకర్ నాన్సి పిలోసి పేర్కొన్నారు. ఈ సమస్యపై పలు ప్రత్నామ్నాయ మార్గాలు ఉన్నాయని, దీనికి చాలామంది ప్రజలు సైతం అంగీకరిస్తున్నారని, అయినా ట్రంప్ వైఖరి మారడం లేదని అన్నారు. ఇలావుండగా ప్రెసిడెంట్ కాని, డెమోక్రాటిక్ నేతల వల్ల కాని అమెరికాలో ఇలా పాక్షిక షట్‌డౌన్ జరిగిన 34 రోజుల పాటు కార్యకలాపాలు స్తంభించడం అమెరికా చరిత్రలోనే మొదటిసారని, లక్షలాది మంది ఉద్యోగులు భోజనానికి సైతం బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని, ఎయిర్‌పోర్టు, ఎఫ్‌బిఐ దర్యాప్తు, ఫుడ్ సేఫ్టీ ఇలా పలు రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉందని సీఎన్‌ఎన్ తెలియజేసింది.