అంతర్జాతీయం

భూవ్యవస్థ పనితీరుకు కృత్రిమ మేధస్సు దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, ఫిబ్రవరి 15: వాతావరణ పరిస్థితులతోపాటు భూవ్యవస్థ పనితీరును తెలుసుకునేందుకు కృత్రిమ మేధస్సు ఎంతో దోహదపడుతుందని ఒక పరిధోధనలో తేలింది. ముఖ్యంగా హరికేన్లు వంటి తుఫాన్‌లు, అగ్ని ప్రమాదాలు వంటి అకాలంగా సంభవించే పరిస్థితులను ముందుగానే తెలుసుకునేందుకు కృత్రిమ మేధస్సు (ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్)తో మేలు జరుగుతుందని జర్మనీకి చెందిన ఫ్రీడ్రిచ్ చిల్లర్ యూనివర్సిటీ జెనా (ఎఫ్‌ఎస్‌యూ)కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. కృత్రిమ మేధస్సు సహాయంతో వాతావరణ పరిస్థితులతోపాటు భూవ్యవస్థ పనితీరులో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చునని యూనివర్సిటీ పరిశోధకులు తమ తాజా నేచర్ జర్నల్‌లో పేర్కొన్నారు. భూమి, నేల, మట్టి వంటి అంశాల్లో చోటుచేసుకున్న భౌతిక, రసాయనిక మార్పులను ఈ కృత్రిమ మేధస్సుతో సునిశితంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, భూసారంలో గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న మార్పులను సమగ్రంగా తెలుసుకునేందుకు మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని ఆ పరిశోధకులు నొక్కిచెప్పారు.