అంతర్జాతీయం

పాక్ పాఠశాలలో భారత జాతీయ గీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ: పాకిస్తాన్‌లోని ఓ పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసినందుకు ఆ పాఠశాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి భారత్ పట్ల ఆ దేశానికున్న వ్యతిరేకతను మరోసారి చాటుకుంది. ఇలాంటి సంఘటనలు తమ జాతీయత భావాన్ని దెబ్బతీస్తాయని పాకిస్తాన్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సౌదీ అరేబియా, అమెరికా, ఈజిప్ట్, పాకిస్తాన్, భారత్ తదితర దేశాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలను చిన్నారులు ప్రదర్శించారని, ఎవరో పనిగట్టుకుని కేవలం భారత్‌కు చెందిన కార్యక్రమాన్ని మాత్రమే ట్వీట్ చేసి తప్పుడు ప్రచారం చేశారని పాఠశాలకు చెందిన వైస్‌ప్రిన్సిపాల్ ఫాతిమా పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమం పేరుతో భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించినందుకు ‘మామా బేబీ కేర్ కేంబ్రిడ్జ్ స్కూల్’కు బుధవారంనాడు డైరెక్టర్ ఆఫ్ ఇన్‌స్పెక్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రైవేట్ ఇనిస్టిట్యూషన్స్ సింధ్ (డీఐఆర్‌పీఐఎస్) షోకాజ్ నోటీసు జారీచేసింది. వారం రోజుల క్రితం ప్రదర్శించిన కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు న్యూస్ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది. భారత సంస్కృతిని ప్రదర్శించినందుకు పాఠశాల రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు డైరెక్టరేట్ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాట్లు చేశారని, పాకిస్తాన్ జాతీయతా భావాన్ని దెబ్బతీసే విధంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించినందుకు పాఠశాల యాజమాన్యాన్ని క్షమించేది లేదని డైరెక్టరేట్ రిజిస్ట్రార్ రాఫియా జావెద్ పేర్కొన్నట్లు తెలిపింది. ఇది చాలా సున్నితమైన విషయమని ఇలాంటి సంఘటనలపై వెంటనే చర్యలు తీసుకోకుంటే జనాగ్రహానికి గురవుతామని జావెద్ వ్యాఖ్యానించినట్లు తెలిపింది.