అంతర్జాతీయం

మాకు ఎలాంటి ఆందోళన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 22: సింధూజలాల ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావలసిన రావి, సట్లెజ్, బియాస్ నదుల నీటిని వదలకుండా నిలిపివేయాలనే భారత్ ప్రణాళిక పట్ల పాకిస్తాన్‌కు ఎలాంటి ఆందోళన లేదని ఆ దేశానికి చెందిన ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాది జరిపిన భయంకరమయిన ఆత్మాహుతి బాంబు దాడి తరువాత సింధూ జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు వెళ్లవలసిన నదీ జలాలను నిలిపివేయాలని భారత్ నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి నితి న్ గడ్కరీ గురువారం ఢిల్లీలో ప్రకటించారు. ఆ తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఖవాజా షుమాయిల్ గురువారం ఇక్కడ డాన్ వార్తాపత్రికతో మాట్లాడుతూ గడ్కరీ ప్రకటనపై స్పం దించారు. ‘సింధూ జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు రావలసిన తూర్పు నదుల జలాలను భారత్ మళ్లించి తన దేశ ప్రజల కోసం వినియోగించినా, ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించినా మాకు ఆందోళన కాని అభ్యంతరం కాని లేదు. ఎందుకంటే భారత్ ఆ జలాలను మళ్లించడానికి సింధూ జలాల ఒప్పందం వీలు కల్పిస్తోంది’ అని షుమాయిల్ అన్నారు. అయితే, పశ్చిమ నదులయిన చెనబ్, ఇండస్, జెలూమ్ నదుల నీటిని భారత్ మళ్లిస్తే మాత్రం మేము తప్పకుండా మా ఆందోళనను వ్యక్తం చేస్తాం. మా అభ్యంతరాన్ని తెలియజేస్తాం. ఈ నదులపై మాకు హక్కు ఉంది’ అని షుమాయిల్ స్పష్టం చేశారు.