అంతర్జాతీయం

టర్కీలో తిరుగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలే ఉగ్రవాదుల వరుస బాంబు దాడులతో రక్తమోడుతున్న టర్కీ.. ఇప్పుడు ఏకంగా సైనిక తిరుగుబాటుకు అల్లల్లాడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి సగటున నెలకు కనీసం రెండు మానవ బాంబు దాడులతో నిరంతర రుధిరధార పారుతున్న ఈ నాటో కూటమి దేశాన్ని శుక్రవారం రాత్రి అనూహ్యమైన రీతిలో జరిగిన సైనిక తిరుగుబాటుతో రక్తసిక్తం చేసింది. దశాబ్దాలలో కనీవినీ ఎరుగని స్థాయిలో రాజధాని అంకారా, ప్రధాన నగరం ఇస్తాంబుల్‌తో సహా అనేక ప్రాంతాల్లో అల్లర్లు, హింస, కాల్పులు, బాంబు దాడులతో రాత్రి అంతా టర్కీ దద్దరిల్లిపోయింది. తిరుగుబాటుదారులు రాసిన ఈ రక్తచరిత్రలో ఇప్పటివరకైతే 250 మంది విగతజీవులయ్యారు. దాదాపు 1400మంది క్షతగాత్రులయ్యారు. విపరీతంగా ఆస్తినష్టం వాటిల్లింది. అంకారాలో పార్లమెంటు భవనం దారుణంగా దెబ్బతిన్నది.
13 ఏళ్లుగా టర్కీకి అధ్యక్షుడిగా ఉన్న రెసెప్‌టరుూ్యప్ ఎర్డోగన్‌ను పదవీచ్యుతుణ్ణి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి జరిగిన కుట్రను ఎర్డోగన్ ఆధీనంలోని బలగాలు కొద్ది గంటల్లోనే విజయవంతంగా ఛేదించాయి. మూడువేల మందికి పైగా తిరుగుబాటుదారులను నిర్బంధించాయి. వందమంది తిరుగుబాటు సైనికులను మట్టుబెట్టాయి. ఈ కుట్రను నాటో దేశాలతో సహా, ప్రపంచ దేశాలన్నీ ఒక్కమాటపై ఖండించాయి. టర్కీ పొరుగున ఉన్న దేశాల్లో ఈ కుట్రకు వ్యతిరేకంగా, ఎర్డోగన్‌కు అనుకూలంగా ప్రదర్శనలు జరిగాయి.

చిత్రాలు.. సైన్యం దాడులను అడ్డుకుంటున్న పోలీసులు
తిరుగుబాటుకు దిగిన సైన్యంపై ప్రతిదాడులు చేస్తున్న టర్కీ ప్రజలు