అంతర్జాతీయం

ప్రధాని మోదీకి సియోల్ శాంతి బహుమతి ఈ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, ఫిబ్రవరి 22: భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ అత్యంత ప్రతిష్టాత్మకమైన సియోల్ శాంతి బహుమతిని శుక్రవారం అందుకున్నారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య సహకారం, అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధికి మోదీ చేసిన కృషికి లభించిన ఈ అవార్డును ఇక్కడ అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో సియోల్ శాంతి బహుమతి సంస్థ ఆయనకు అందజేసింది. ఈ సందర్భంగా మోదీ ఆయన జీవిత విశేషాలు, సాధించిన ఘన కార్యాలను తెలియజేస్తూ తయారుచేసిన షార్టు ఫిల్మ్‌ను ప్రదర్శించారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును తనకు అందజేయడం పట్ల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసిన మోదీ ‘ఈ బహుమతి వ్యక్తిగతంగా నాకు లభించింది కాదు.. ఇది భారతీయ ప్రజలందరిదీ’ అని వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాలుగా భారతదేశ ప్రజల స్ఫూర్తి, ఆకాంక్షలు, ప్రయత్నాల వల్లే ఈ ఘనత సాధ్యపడిందని, భారతదేశ ప్రజలందరి తరఫున తానీ అవార్డును స్వీకరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలు జరుపుకునే ఈ సంవత్సరంలో తనకు ఈ అవార్డును అందజేయ డం పట్ల కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన ఈ అవార్డు కింద వచ్చే 2లక్షల యూఎస్ డాలర్ల నగదు బహుమతిని తమ దేశంలో గంగానది ప్రక్షాళనకు ఉద్దేశించిన ‘నమామి గంజ్’ పథకానికి విరాళంగా ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. 1988లో సియోల్ ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్ది వారాల ముం దు ఉగ్రవాద దాడి జరిగిన విషయాన్ని ఆ యన గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విప్లవవాదం, ఉగ్రవాదం వేళ్లూనుకుని ఉన్నాయని, వీటితో శాంతి, రక్షణకు తీవ్ర భంగం కలుగుతోందని అన్నారు. కొరియా దేశంలాగే భారత్ కూడా సరిహద్దుల వద్ద పలు సమస్యలను ఎదుర్కొంటున్నదని ఆయన చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి పలికి మానవతావాదంతో చేతులు కలిపే రోజు వస్తుందన్న ఆయన పాకిస్తాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పలు దేశాలను ఒక తాటిపైకి తీసుకురావడానికి నార్త్ కొరియా నేత మూన్ జా-ఇన్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
ఈ అవార్డు అందుకున్న వారిలో మోదీ 14వ వారు. అంతకుముందు ఈ అవార్డును ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, జర్మన్ వైస్ చాన్స్‌లర్ ఏంజెలా మెకెల్ తదితరులు అందుకున్నారు. 24వ ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో 1990లో సియోల్ శాంతి బహుమతిని ఇవ్వడం ప్రారంభించారు. కొరియా ద్వీపకల్పం, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో శాంతికి కృషి చేసిన వారికి ఈ బహుమతిని అందజేస్తారు.