అంతర్జాతీయం

అధ్యక్ష పదవికి నూర్సుల్టాన్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, మార్చి 20: కజకిస్తాన్ పార్లమెంటులో ఆసక్తికరమైన పరిణామాల మధ్య స్పీకర్ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. దేశాధ్యక్షుడు నూర్సుల్టాన్ నజార్బయేవ్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. దీంతో దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 30 ఏళ్లుగా నూర్సుల్టాన్ అధికారంలో ఉన్నారు. మంగళవారం ఆయన టీవీ ప్రసంగంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 78 ఏళ్ల నూర్సుల్టాన్ బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన వారు నూర్సుల్టాన్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇదే కార్యక్రమంలో స్పీకర్ టోకయేవ్ తాత్కాలిక అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాగా కజకిస్తాన్ రాజధాని ఆస్తానా పేరును నూర్సుల్టాన్‌గా నామకరణం చేస్తున్నట్లు కొత్త అధ్యక్షుడు ప్రకటించారు. నూర్సుల్టాన్ దేశానికి చేసిన సేవలను టోకయేవ్ ప్రశంసించారు. 1989లో నూర్సుల్టాన్ దేశాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దేశంలో శాంతి సుస్థిరతలు కాపాడడంలో నూర్సుల్టాన్ గట్టి చర్యలు తీసుకున్నారని, పరిపాలనాధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నారు.