అంతర్జాతీయం

హైడ్రోజన్ తయారీలో అమెరికా ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 23: తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసే విధానాన్ని అమెరికా శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. ఈ ఇంధనం యొక్క సామర్థ్యం బాగుంటుందని వారు చెప్పారు. ఆర్కానాస్ వర్శిటీ, ఆర్గోనే్న నేషనల్ ల్యాబ్‌కు చెందిన శాస్తవ్రేత్తలు హెచ్2ఓ (నీరు)ను మరింత విశే్లషించి విచ్ఛిన్నం చేస్తే హైడ్రోజన్ ఇంధనం తయారవుతుందని చెప్పారు. ఈ మేరకు జరుగుతున్న పరిశోధనల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. నానో ఉత్ప్రేరకాలైన నికెల్, ఐరన్‌ల వల్ల నీటి పరమాణువులను విడదీయవచ్చని చెప్పారు. ఎలక్ట్రాన్స్‌తో సంయోజనం ద్వారా హైడ్రోజన్ వాయువును తయారు చేయవచ్చన్నారు. హైడ్రోజన్, ఆక్సిజన్ బంధాలు బలహీనపడేందుకు ఉత్ప్రేరకాలు పనిచేస్తాయన్నారు. ఈ విధానం ద్వారా హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసే అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. వాటర్ ఎలక్ట్రోసిస్ విధానం సమర్థంగా ఉందని శాస్తవ్రేత్తలు తెలిపారు.