అంతర్జాతీయం

పెను తుపానులో చిక్కుకున్న నార్వే నౌక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓస్లో, మార్చి 24: నార్వే తీరంలో సముద్రంలో తుపానులో చిక్కుకున్న ఒక నౌకలో ఉన్న 1300 మంది ప్రయాణీకులను నార్వే ప్రభుత్వం హెలికాప్టర్లు, విమానాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఈ నౌక తీరం నుంచి 2 కి.మీ దూరంలో ఉండగా తుపానులో చిక్కుకుంది. దీంతో పరిస్థితి అదుపుతప్పిందంటూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని, రక్షించాలంటూ కెప్టెన్ సంబంధిత శాఖకు సంకేతాలు పంపారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వం రంగంలోకి దిగింది. హెలికాప్టర్ల ద్వారా నౌకలో ఉన్న ప్రయాణీకులు, సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టింది. శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు 1373 మందిలో 397 మందిని ఒడ్డుకు చేర్చింది. ప్రతి ట్రిప్పులో 15-20 మంది సిబ్బందిని తరలిస్తున్నారు. చోపర్ వచ్చిన వెంటనే సిబ్బంది దానిలో వెంటనే సురక్షిత ప్రాంతానికి పోటీపడుతున్నారు. హెలికాప్టర్ వచ్చిన వెంటనే తమను ఎక్కించుకోవాలంటూ ప్రయాణీకులు అరుస్తున్నారు. సురక్షితంగా బయపడిన జాకబ్ అనే వ్యక్తి మాట్లాడుతూ హెలికాప్టర్‌లో రావడం కూడా భీతి గొల్పుతోందని, వేగంగా వీస్తున్న గాలుల వల్ల హెలికాప్టర్‌లో కుదుపులొస్తున్నాయని చెప్పారు. ఈ నౌక పేరు వైకింగ్ స్కై అని ప్రభుత్వం తెలిపింది. సముద్రంలో తుపాను, గాలులు తీవ్రంగా ఉన్నాయని అమెరికన్ జాన్ కర్రీ చెప్పారు. ఓస్లో నుంచి పది నాటికన్ మైళ్ల దూరంలో హస్టాడ్‌వికా పర్యాటక ప్రాంతానికి ప్రజలు విహార యాత్ర కింద వెళుతుంటారు.