అంతర్జాతీయం

మత మార్పిడి ఘటనలో ఏడుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, మార్చి 25: పాకిస్తాన్‌లో ఇద్దరు హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి వివాహం జరిపించిన కేసులో వివాహ తంతుకు సహకరించిన వ్యక్తి సహా ఏడుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, తమకు రక్షణ కల్పించాలంటూ బాలికలిద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పాకిస్తాన్‌లోని ఘోట్కీ జిల్లా సింధులో హోలీ సందర్భంగా కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు రవీన (13), రీనా (15)లను వారి ఇంటి నుంచి కిడ్నాప్ చేసినట్టు, తర్వాత వారిని ఇస్లాంలోకి మార్చి వివాహం జరిపించినట్టు రెండు వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఈనెల 20న బాలికల కుటుంబ సభ్యులు పిర్యాదు చేయగా, దీనిపై విచారణ జరపాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు ఆదివారం రాత్రి వరకు పంజాబ్‌లోని రహీమ్ యార్‌ఖాన్ జిల్లాలో విస్తృతంగా దాడులు నిర్వహించి బాలికలకు వివాహం జరిపించినట్టు భావిస్తున్న వ్యక్తితో పాటు సున్నీ తెహ్రీక్ పార్టీకి చెందిన ఒక నేత, బాలికలను వివాహం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు, వారి బంధువులు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సింధు పోలీసులకు అప్పగించారు. ఎస్పీ ఫరూఖ్ ఆదివారం బాలికల తండ్రిని పరామర్శించి వారి ఆచూకీకి తగు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఇలావుండగా బాధిత బాలికలిద్దరూ తమకు రక్షణ కల్పించాలంటూ పంజాబ్‌లోని బహవల్పూరు కోర్టును ఆశ్రయించారని జియో టీవీ వెల్లడించింది. హిందూ బాలికలకు బలవంతంగా మత మార్పిడి చేసి పెళ్లిళ్లు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా హిందూ సంస్థల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిపారు.