అంతర్జాతీయం

ఎన్నికలయ్యే వరకూ ఇంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 26: భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలలో ఉద్రిక్తతలు కొనసాగుతాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. భారత్ మరోసారి పాకిస్తాన్‌పై దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ (జేఈఎం) ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడి, 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న తరువాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో భారత్ ఫిబ్రవరి 26వ తేదీన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో గల జేఈఎం శిక్షణ శిబిరంపై వైమానిక దాడికి పాల్పడింది.
మరుసటి రోజు పాకిస్తాన్ వైమానిక దాడికి ప్రయత్నించగా, భారత్ తిప్పికొట్టింది. ఈ సందర్భంగా భారత పైలట్ ఒకరు పాకిస్తాన్‌కు చిక్కగా, అతడిని తరువాత భారత్‌కు అప్పగించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనాయంత్రాంగం సార్వత్రిక ఎన్నికల లోపు మరో దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశం ఉందని, అందువల్ల ఇరు దేశాల మీద యుద్ధమేఘాలు ఇప్పటికీ కమ్ముకునే ఉన్నాయని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
‘ప్రమాదం ఇంకా తొలగిపోలేదు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంటుంది. భారత్ నుంచి జరిగే ఎలాంటి దురాక్రమణను అయినా తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నట్టు డాన్ వార్తాపత్రిక పేర్కొంది. అఫ్గానిస్తాన్ ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళన కారణంగా ఇస్లామాబాద్‌లో తాలిబన్లతో జరగాల్సిన తన సమావేశాన్ని రద్దు చేసుకున్నట్టు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.