అంతర్జాతీయం

రంజాన్ చాలా ప్రత్యేకమైన నెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 14: రంజాన్ చాలా ప్రత్యేకమయిన నెల అని, ఈ నెలలో ప్రజలు సహనాన్ని, శాంతిని కోరుకుంటారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రంజాన్ నెలను పురస్కరించుకొని తాను అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చానని ఆయన తెలిపారు. న్యూజిలాండ్, శ్రీలంకలో భయంకరమయిన ఉగ్రవాద దాడులు జరగడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ రెండోసారి సోమవారం రాత్రి తన పాలనా యంత్రాంగంలోని ఉన్నత స్థాయిలో గల ముస్లింలకు, వివిధ దేశాలకు చెందిన ఉన్నత స్థాయి దౌత్యవేత్తలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వైట్‌హౌస్‌లోని స్టేట్ డైనింగ్ రూమ్‌లో కొద్ది సేపు మాట్లాడుతూ అమెరికాలో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలకు రంజాన్ ఒక పవిత్రమయిన నెల అని అన్నారు. ‘రమదాన్ అంటే దాతృత్వాన్ని ప్రదర్శించే సమయం. కుటుంబాలు, ఇరుగుపొరుగు వారు, మతాలు సన్నిహితమయ్యే కాలం’ అని ట్రంప్ అన్నారు. ఇదే స్ఫూర్తితో పగలంతా చేసిన ఉపవాస దీక్షను విరమించేందుకు సంప్రదాయ రమదాన్ భోజనమయిన ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి మనమంతా ఈ రోజు రాత్రి ఇక్కడ కలిశాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. రంజాన్ నెలలో ముస్లింలు ప్రతి రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి, ప్రార్థనలపై, ఆధ్యాత్మిక జీవనంపై కేంద్రీకరిస్తారు. ‘ఈ రోజు సాయంత్రం మన ఆలోచనలు మతవిశ్వాసులతో నిండిపోయాయి. ఈ మతవిశ్వాసులు ఇటీవలి వారాలలో అనేక విపత్తులను, కడగండ్లను ఎదుర్కొన్నారు. ఇది చాలా ఒడిదుడుకులతో కూడిన సమయం. న్యూజిలాండ్‌లోని మసీదుల్లో హత్యకు గురయిన ముస్లింలు, శ్రీలంక, కాలిఫోర్నియా, పిట్స్‌బర్గ్‌లలో హత్యకు గురయిన క్రిస్టియన్లు, యూదులు, ఇతర భగవంతుడి పిల్లల కోసం మన హృదయాలు విచారంతో నిండిపోయాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు.