అంతర్జాతీయం

రష్యన్లపై అమెరికా ఆంక్షలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 17: రష్యన్లపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ ప్రతిపక్ష నేతను హత్య చేసిన సంఘటనలో ముద్దాయిలుగా ఉన్న ఐదుగురు రష్యన్లపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇటీవలే ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అమెరికా ఆంక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యాలో మానవ హక్కుల ఉల్లంఘన ఆనవాయితీగా మారిందని, ఈ నేపథ్యంలోనే దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయని అమెరికా చట్ట సభకు సమర్పించిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు. 2009లో కస్టడీలోనే మృతి చెందిన సెర్గీ మాగ్నిట్‌క్సి పేరును ఈ నివేదికలో చేర్చారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన ఐదుగురి పేర్లను నివేదికలో పొందుపరిచారు. దీనిపై చర్చ అనంతరం ఆ ఐదుగురిపై అమెరికా కాంగ్రెస్ ఆంక్షలు విధించింది. ఈ రకంగా ఆంక్షలకు గురైనవారికి అమెరికాలో ఎలాంటి హక్కులు ఉండవు. ఒకవేళ వారు అమెరికాలోనే ఉంటే తక్షణమే స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ తమ దేశంలోనే ఉంటే అమెరికాలో అడుగుపెట్టడానికి వీలుండదు. వ్యక్తులపై ఇలాంటి ఆంక్షలను విధించడం చాలా అరుదు.