అంతర్జాతీయం

ఒప్పందంలోని అంశాలను వ్యతిరేకించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 2: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే (బ్రెగ్జిట్) ఒప్పందంలోని పలు అంశాలకు వ్యతిరేకంగా బ్రిటన్ ముందుకు సాగాలని, ఒప్పందంలో భాగంగా అంగీకరించిన 39 బిలియన్ పౌండ్లు (45 బిలియన్ యూరోలు, 50 బిలియన్ డాలర్లు) చెల్లించడానికి నిరాకరించాలని ఆ దేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ట్రంప్ త్వరలో లండన్‌కు వెళ్లనున్న తరుణంలో ‘ద సండే టైమ్స్’ వార్తాపత్రికతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. థెరిసా మే నుంచి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించడానికి మాజీ విదేశాంగ శాఖ మంత్రి బోరిస్ జాన్సన్ ఉత్తమ నేత అని తాను భావిస్తున్నట్టు ట్రంప్ ‘ద సన్’ వార్తాపత్రికకు చెప్పిన తరువాత ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రెగ్జిట్‌కు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం పొందడంలో విఫలమయిన థెరిసా మే జూన్ ఏడో తేదీన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ట్రంప్ మూడు రోజుల బ్రిటన్ పర్యటన సోమవారం మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆయన రాణి ఎలిజబెత్-2తో భేటీ అవుతారు. థెరిసా మేతోనూ చర్చలు జరుపుతారు. బ్రెగ్జిట్ విషయంలో ఒప్పందాల కోసం చర్చలు జరిపే సమయంలో తన రూల్ బుక్‌ను అనుసరించాలని ట్రంప్ ‘ద సండే టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. ‘వారు ఏమి కోరుకున్నారో దాన్ని వారు పొందకపోతే, నేనయితే బయటకు వెళ్లిపోతాను.. మీరు కోరుకున్న ఒప్పందాన్ని మీరు పొందకపోతే, మీరు న్యాయమయిన ఒప్పందాన్ని పొందకపోతే, అప్పుడు మీరు చర్చలనుంచి బయటకు వెళ్లిపోవాలి’ అని ట్రంప్ పేర్కొన్నారు.
1973 నుంచి యూరోపియన్ యూనియన్‌లో ఉన్న బ్రిటన్ దానిలో నుంచి వైదొలగుతున్నందుకు చెల్లించవలసిన మొత్తం గురించి ట్రంప్ మాట్లాడుతూ ‘వారి స్థానంలో నేను ఉండి ఉంటే నేను 50 బిలియన్ డాలర్లు చెల్లించకపోయేవాడిని. అది చాలా పెద్ద మొత్తం’ అని అన్నారు. బ్రిటన్‌లోని యూరోపియన్ యూనియన్ వ్యతిరేకి, ప్రజాకర్షక రాజకీయ నాయకుడు, బ్రెగ్జిట్ పార్టీ అధినేత నిగెల్ ఫరాగేను బ్రెగ్జిట్ చర్చల్లో భాగస్వామిని చేయాలని కూడా ట్రంప్ సూచించారు.
ఫరాగే చాలా తెలివయిన వారని ఆయన పేర్కొన్నారు. అయితే, బ్రిటన్ అధికారులు ఫరాగేను చర్చల్లోకి తీసుకురారని కూడా ట్రంప్ అన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని 2016లో నిర్వహించిన రెఫరెండంలో బ్రిటన్‌లోని మెజారిటీ ఓటర్లు నిర్ణయించారు. ఈ సంవత్సరం మార్చిలో ఈయూనుంచి బ్రిటన్ బయటకు రావలసి ఉండింది.
అయితే, దానిని ఎలా సాధించడం అనే విషయంలో బ్రిటన్‌లో ప్రతిష్టంభన నెలకొంది. ఏ రకమయిన ‘బ్రెగ్జిట్’ కావాలనే విషయంలో థెరిసా మే నాయకత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ, బ్రిటన్ పార్లమెంటు రెండుగా చీలిపోయాయి.