అంతర్జాతీయం

కలసి నడుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 13: భారత్- అమెరికా మైత్రి మరింత బలపడడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయన్న ఆశాభావాన్ని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వ్యక్తం చేశారు. త్వరలోనే భారత్ పర్యటనకు రానున్న ఆయన బుధవారం చేసిన ఈవ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్‌లో పాంపియో కీలక ఉపన్యాసం చేశారు. మొన్నటి ఎన్నికల్లో ‘మోదీ ఉంటేనే సాధ్యమవుతుంది’అన్న నినాదం భారత్‌లో ఘన విజయం సాధించిందని పాంపియే ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య పటిష్టమైన సంబంధాలు నెలకొంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 24 నుంచి పాంపియో భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో అనేక అంశాలపై పాంపియో చర్చిస్తారు. ‘భారత్ తమకు ఎప్పటి నుంచో మిత్రదేశం. మేం ఎప్పుడూ ద్వైపాక్షి, స్వేచ్ఛా వాణిజ్య సంబంధాలను కోరుకుంటాం. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీతో ఇరుదేశాల మధ్య మైత్రి మరింత బలపడాలన్నదే మా ఆకాంక్ష’అని ఆయన స్పష్టం చేశారు. ‘పెద్ద ఆలోచనలు..మరిన్ని పెద్ద అవకాశాలు’ ఇరుదేశాలు అందిపుచ్చుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి 30 వరకూ భారత్, జపాన్, శ్రీలంక, దక్షిణ కొరియా దేశాల్లో పాంపియో పర్యటిస్తారు. నాలుగుదేశాలతో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయని, వాటిని మరింత బలోపేతం చేయడానికి తన పర్యటన దోహపడుతుందని, ప్రధాన ఉద్దేశం కూడా అదేనని ఆయన తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సైనికీకరణకు చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దానికి అడ్డుకట్టవేయడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. దక్షిణ చైనా సముద్రం తమదేనేని బీజింగ్ ఈ పాటికే ప్రకటించుకుంది. వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనే, తైవాన్ దేశాలు ఆ సముద్రంపై తమకూ హక్కుందని చెబుతున్నాయి. ఉగ్రవాదంపై కఠినంగా ఉండాలని ఓ పక్క పాకిస్తాన్‌ను గట్టిగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తలకు తావులేని వాతావరణం కల్పించేందుకు రంగంలో దిగింది. ‘ట్రంప్, మోదీ ప్రభుత్వాలు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఏకతాటిపైకి రావల్సి సమయం ఆసన్నమైంది. ప్రత్యేక భాగస్వామ్యం ఇక ముందూ కొనసాగుతుంది’అని పాంపియో తెలిపారు.