అంతర్జాతీయం

కాస్మోటిక్స్‌తో పిల్లలకు శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 17: కాస్మోటిక్స్ వినియోగం పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయని అమెరికా శాస్తవ్రేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చేసిన అధ్యయనంలో ప్రతి రెండు గంటలకో చిన్నారి ఆసుపత్రి పాలవుతున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత సౌందర్యం కోసం ఉపయోగించే షాంపు, లోషన్లు, నెయిల్ పాలిష్ వంటివి ఉపయోగించడం వల్ల విషం బారిన పడుతున్నారని, ఇంకా రసాయన దద్దుర్లు రావడంతో వైద్యుల వద్దకు పరుగు పెట్టాల్సి వస్తున్నట్లు తెలిపారు. 2002 నుంచి 2016 మధ్య కాలంలో దేశం మొత్తంలో నిర్వహించిన అధ్యయనంలో 64,686 మంది ఐదేళ్ళ లోపు చిన్నారులు వైద్య చికిత్స పొందినట్లు తేలిందని తాజాగా వెల్లడించిన అధ్యయనం నివేదికలో పేర్కొన్నారు. వీటి వల్ల చర్మ వ్యాధులు, చర్మం కాలినట్లు కావడం, కనుపాపలకు ఉపయోగించే కాస్మోటిక్ వల్ల కంటి చూపు తగ్గడం జరిగిందని స్థానికంగా వెలువడే జర్నల్ తెలిపింది. చిన్న పిల్లలు జర్నల్‌ను చదవలేరని, వీటిని ఉపయోగించడం వల్ల కలిగే దుష్ఫలితాల గురించి తెలుసుకోలేరని పేర్కొంది. రంగు రంగుల ఈ కాస్మోటిక్స్ కనిపించడం, ఇంకా సువాసన రావడంతో పిల్లలు వాటిని ఉపయోగించేందుకు ఇష్టపడతారని తెలిపింది. పిల్లలు అదేదో పానీయం అని భావించి తాగిన దాఖలాలూ ఉన్నాయని వివరించింది. గోర్లపై నెయిల్ పాలిష్ కూడా ప్రమాదకరమైన రసాయనాలేనని తెలిపింది. కాబట్టి తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలని ఆ జర్నల్ పేర్కొంది.