అంతర్జాతీయం

హాంకాంగ్ పార్లమెంటులో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, జూన్ 19: చాలాకాలం తర్వాత బుధవారం జరిగిన హాంకాంగ్ లెజిస్లేచర్ సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. బీజింగ్‌కు చైనా అనుకూల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వేలాదిగా వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేసినవారిపై ప్రభుత్వం దౌర్జన్యాలకు దిగడాన్ని ప్రతిపక్షాలు ఎండగట్టాయి. వివిధ నేరాల్లో నిందితులను విచారణ నిమిత్తం చైనాకు అప్పగించాలన్న హాంకాంగ్ సర్కారు చేసిన బిల్లుపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా హాంకాంగ్ వీధులన్నీ ప్రదర్శనకారులతో నిండిపోతున్నాయి. ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో విపక్షాలు కూడా వారితో జతకలిశాయి. చైనాకు అనుకూలమైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని వివిధ పార్టీలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. నిందితులను చైనాకు అప్పగించాలన్న బిల్లును తక్షణమే ఉపసంహరించాలని అంటూ బుధవారం జరిగిన సమావేశంలో పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. ఎలాంటి ప్రతిపాదనలు లేదా బిల్లులు లేదా చట్టాలను వ్యతిరేకించి తీరుతామని వారు స్పష్టం చేశారు.
హాంకాంగ్ ప్రజల సేచ్ఛా, స్వాతంత్య్రాలను హరించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని వారు మండిపడ్డారు. విపక్షాల డిమాండ్‌ను సర్కారు పట్టించుకోకపోవడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సభ వాయిదా పడింది. అయితే, బలవంతంగానైనా ఈ బిల్లును చట్టరూపంలో తీసుకురావాలని సర్కారు పట్టుదలతో ఉంది.