అంతర్జాతీయం

పాక్‌కు సాయంలో ‘షరతులు’ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 19: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ పురోభివృద్ధికి నిధుల మంజూరు చేసే విషయంలో అమెరికా ఆచితూచి అడుగులు వేస్తోంది. వాషింగ్టన్‌లోని ఐఎంఎఫ్ కార్యాలయం విడుదల చేస్తానన్న నిధుల మంజూరు విషయంలో అమెరికాకు దృఢమైన అభిప్రాయాలున్నాయని.. ‘షరతులు’ తప్పవని అమెరికా అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. చైనాకు బకాయిలు చెల్లించాల్సి ఉన్న దృష్ట్యా ఈ రకమైన అభిప్రాయాన్ని పాక్‌కు సమాచారాన్ని అందించినట్లు చెబుతున్నారు. దేశ పురోభివృద్ధి దృష్ట్యా తమకు ఆరు బిలియన్ల ప్యాకేజీని అందించాలని గత నెలలో పాక్ చేసిన విజ్ఞప్తి మేరకు ఐఎంఎంఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. పాక్‌కు రుణం మంజూరు అంశంలో షరతులతో కూడిన ప్యాకేజీయే సరైనదని సౌత్, సెంటర్ ఏసియన్ వ్యవహారాల వాఖ సీనియర్ అధికారి అలైస్ జీవెల్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు రుణ సాయం అంశంపై కుదిరిన ఒప్పందం అంశాన్ని తానింతవరకు చూడలేదని గత వారం జరిగిన న్యాయ సలహాదారుల సమావేశంలో ఆమె వెల్లడించారు.