అంతర్జాతీయం

దక్షిణాఫ్రికాలో పట్టు కోల్పోతున్న ఎఎన్‌సి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహాన్స్‌బర్గ్, ఆగస్టు 6: దక్షిణాఫ్రికాలోని అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎఎన్‌సి)కి ఎన్నికల రీత్యా గతంలో ఎన్నడూ లేని రీతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మైనారిటీలయిన శే్వతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం సలిపి 1994 ఎన్నికల్లో విస్త్రృత ప్రజాబాహుళ్యం మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఎఎన్‌సికి ఈ స్థాయిలో ఎదురుదెబ్బ తగలడం ఇదే మొదటిసారి. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఆ పార్టీ బలం మరింత క్షీణించింది. ఇంకా ఒక శాతానికి లోపే ఓట్లు లెక్కించాల్సి ఉండగా, దేశంలోని రెండు అతిపెద్ద నగరాలలో అధికారం ఎవరికి దక్కుతుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. అతిపెద్ద నగరం జోహాన్స్‌బర్గ్, రాజధాని మెట్రోపాలిటన్ ప్రాంతమైన ష్వాన్‌లలో గట్టిపోటీ నెలకొంది. అవినీతి కుంభకోణాలు, ఆర్థిక మాంద్యంవల్ల ఎఎన్‌సి పట్టణ మధ్య తరగతి ప్రజల్లో పట్టు కోల్పోయింది. నల్లజాతి సూరీడు, ఎఎన్‌సి వ్యవస్థాపకుడు నెల్సన్ మండేలా పేరుమీద ఏర్పాటుచేసిన, నల్లజాతి ప్రజలు అధిక సంఖ్యలో ఉన్న మున్సిపాలిటీ నెల్సన్ మండేలా బేను ఎఎన్‌సి ఇప్పటికే కోల్పోయింది. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరుసలిపిన వారసత్వం ఉన్న ప్రతిపక్ష డెమొక్రటిక్ అలయన్స్ నెల్సన్ మండేలా బే నగరాన్ని గెలుచుకుంది. ఇక్కడినుంచి ఒక శే్వత జాతీయుడయిన నేత మేయర్‌గా ఎన్నికయ్యారు. దేశంలోని రెండో అతి పెద్ద నగరమైన కేప్‌టౌన్‌లో ఇప్పటికే డెమొక్రటిక్ అలయెన్స్ అధికారంలో ఉంది. ఈ స్థానిక ఎన్నికల్లో ఎఎన్‌సికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 53 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీకి ఇంత తక్కువ శాతం ఓట్లు రావడం ఇదే మొదటిసారి. డెమొక్రటిక్ అలయెన్స్‌కు 26 శాతం ఓట్లు వచ్చాయి.