అంతర్జాతీయం

ఐరాస భవనంపై యోగా ముద్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం జరుపుకోనున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయ భవనంపై వివిధ యోగా ముద్రలు దర్శనమిచ్చాయి. కళ్లు చెదిరే లైటింగ్‌లో వివిధ రకాల యోగా ముద్రలు కనువిందు చేస్తున్నాయి. యోగాకు ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్, డిప్యూటీ శాశ్వత రాయబారి కే నాగరాజనాయుడు, పలువురు ఉన్నతాధికారులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐరాసలో ఘనంగా జరుపుకొనేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సూర్య నమస్కారాల భంగిమలతో ఐరాస భవనం కొత్త కళను సంతరించుకొంది. దైనందిన జీవితంలో భాగం గా సూర్య నమస్కారాలు చేయాలని ప్రధాన మోదీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. గతంలో వివిధ ప్రాంతాల్లో వివిధ తేదీల్లో యోగా దినోత్సవాలు జరుపుకొనే వారు. ఐక్యరాజ్యసమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించడంతో దాదాపు అన్ని దేశాలు గత ఐదు సంవత్సరాలుగా ఇదే తేదీని అనుసరిస్తున్నాయి. 2014 డిసెంబర్ 11వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తిస్తున్నట్లు ఐరాస ప్రకటించింది.