అంతర్జాతీయం

ఐరాస ప్రధాన కార్యదర్శి పదవి రేసులో ముందున్న గటెర్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 6: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా ఈసారి మహిళను ఎన్నుకోవాలన్న సభ్య దేశాల ఆశలు క్రమంగా ఆవిరైపోతున్నాయి. ఈ పదవికోసం పోటీపడుతున్న 11 అభ్యర్థులకు శుక్రవారం భద్రతా మండలి నిర్వహించిన రెండో విడత సాధారణ ఎన్నికల్లో పోర్చుగల్ మాజీ ప్రధాన మంత్రి అంటానియో గటెర్రెస్ మరోసారి తన ఆధిక్యతను చాటుకున్నారు. భద్రతా మండలిలోని మొత్తం 15 సభ్య దేశాల్లో 11 దేశాలు ఈ ఎన్నికల్లో గటెర్రెస్ అభ్యర్థిత్వాన్ని బలపర్చగా, రెండు దేశాలు వ్యతిరేకించాయని, మరో రెండు దేశాలు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని దౌత్యాధికారులు తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో శరణార్థుల విభాగానికి పదేళ్లపాటు కమిషనర్‌గా సేవలు అందించిన గటెర్రెస్ గత నెలలో నిర్వహించిన తొలి విడత సాధారణ ఎన్నికల్లో కూడా అగ్రస్థానంలో నిలువుగా, స్లొవేనియా మాజీ అధ్యక్షుడు డానిలో టర్క్, యునెస్కో డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన ఇరినా బొకోవా (బల్గేరియా) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అయితే మొదటి విడత సాధారణ ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచిన సెర్బియా మాజీ విదేశంగ మంత్రి వక్ జెరెమిక్ రెండో విడత ఎన్నికల్లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఈ ఎన్నికల్లో అతనికి అనుకూలంగా ఎనిమిది ఓట్లు రాగా, వ్యతిరేకంగా నాలుగు ఓట్లు వచ్చాయి. అయితే జెరెమిక్ అభ్యర్థిత్వంపై మిగిలిన మూడు సభ్య దేశాలు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. అలాగే తొలి విడత సాధారణ ఎన్నికల్లో ఎడో స్థానంలో నిలిచిన అర్జెంటీనా విదేశాంగ మంత్రి సుసానా మాల్కోరాకు రెండో విడత ఎన్నికల్లో ఎనిమిది ఓట్లు అనుకూలంగానూ, ఆరు ఓట్లు వ్యతిరేకంగానూ రాగా, ఒక సభ్య దేశం అభిప్రాయాన్ని వెల్లడించలేదు. దీంతో అతను ఈసారి మూడో స్థానానికి ఎగబాకగా, ఇంతకుముందు మూడో స్థానంలో నిలిచిన బొకోవా రెండో రౌండ్‌లో ఐదో స్థానానికి దిగజారాడు.