అంతర్జాతీయం

బర్త్‌డే పార్టీలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోవన్, ఆగస్టు 6: ఫ్రాన్స్‌లోని రోవన్ నగరంలో ఓ బార్‌లో బర్త్‌డే పార్టీ పెను విషాదాన్ని మిగిల్చింది. బర్త్‌డే పార్టీలో కేక్ వద్ద వెలిగించిన కొవ్వొత్తులు పడి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పక్కనే ఉన్న మద్యం బాటిళ్లపై పడి మంటలు చెలరేగాయి. అంతే అక్కడున్న డెకరేషన్‌కు మంటలు వ్యాపించి 13 మంది దుర్మరణం చెందారు. అగ్ని ప్రమాదంలో చనిపోయినవారంతా 18-25 మధ్య వయస్కులే. అప్పటివరకూ యువత కేరింతలతో ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ప్రమాదావశాత్తూనే జరిగిందని పోలీసులు చెప్పారు. పేలుళ్లకు ఆస్కారం లేదని, కొవ్వొత్తుల వల్లే మంటలు చెలరేగాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. నగరంలోని ఓక్యూబ్ లిబ్రే బార్‌లో శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఏభై మంది అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారని అంతరంగిక మంత్రి బెర్నార్డ్ కజెన్యువే వెల్లడించారు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి ఆందోళనగా ఉందని పోలీసులు తెలిపారు.

చిత్రం..ఫ్రాన్స్‌లోని రోవన్ నగరంలో అగ్ని ప్రమాదం జరిగిన బార్ అండ్ రెస్టారెంట్