అంతర్జాతీయం

కార్ల నుంచి బుల్లెట్ రైళ్ల వరకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోబె, జూన్ 27: కార్లనుంచి బుల్లెట్ రైళ్లవరకు భారత్-జపాన్ సంబంధాలు అనేక కోణాల్లో విస్తరిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ వస్తున్నాయని ఇందుకు భారత్‌లో జపాన్ సహకారంతో చేపడుతున్న అనేక ప్రాజెక్టులే నిదర్శనమని చెప్పారు. జపాన్ పట్టణమైన కోబెలో భారతీయ సంతతిని ఉద్దేశించి గురువారం మాట్లడిన మోదీ భారత ఆర్థికాభివృద్ధిలో జపాన్ కీలక పాత్ర పోషించిందన్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యంతో భారత్ పనిచేస్తోందని ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత శక్తిని సంతరించుకుంటుందని మోదీ తెలిపారు. ఒకప్పుడు కేవలం కార్ల నిర్మాణంలోనే రెండు దేశాల మధ్య సహకారం కొనసాగిందని, అది విస్తరించుకుంటూ బుల్లెట్ రైళ్లకు వచ్చిందన్నారు. ఒసాకాలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న జీ-20 సమావేశానికి హాజరయ్యేందుకు మోదీ ఇక్కడకు వచ్చారు. జపాన్ ప్రాజెక్టులు, పెట్టుబడుల ప్రభావం లేని ప్రాంతమంటూ భారత్‌లో లేదని మోదీ చెప్పారు. అలాగే భారతదేశ యువత శక్తిసామర్ధ్యాలు, శక్తియుక్తులు జపాన్‌కు కూడా ఎంతో బలాన్నిస్తున్నాయని అన్నారు.
చిత్రం...జపాన్ ప్రధాని షింజో అబేతో ప్రధాని నరేంద్ర మోదీ