అంతర్జాతీయం

నీరవ్ మోదీ రిమాండ్ పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 27: బ్రిటన్ జైలులో శిక్షను అనుభవిస్తున్న భారత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రిమాండ్‌ను జూలై 25 వరకు పొడిగిస్తూ లండన్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను 2 బిలియన్ డాలర్ల మేర మోసగించడంతోబాటు, మనీ ల్యాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని అప్పగించాలని బ్రిటన్‌ను భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే. ఐతే తనను భారత్‌కు అప్పగించరాదంటూ న్యాయపోరాటం చేస్తున్న 48 ఏళ్ల నీరవ్ గత మార్చిలో అరెస్టయినప్పటి నుంచి ఇక్కడి నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. బెయిలు కోసం నాల్గవ సారి నీరవ్ పెట్టుకున్న పిటిషన్‌ను ఈనెల 12న బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. 2018 ఆగస్టులో భారత్ నీరవ్ మోదీని అప్పగించాలంటూ బ్రిటన్‌ను కోరడానికి ముందు ఆ ఏడాది మే, జూలై మాసాల్లో రెండు అరెస్టు వారెంట్లు జారీ చేయడం జరిగింది. కాగా గురువారం లండన్ వెస్ట్‌మినిస్టర్స్ మేజిస్ట్రేట్ కోర్టుకు జైలునుంచే వీడియో లింక్ ద్వారా మోదీ అపియర్ అయ్యారు. యూకే చట్టాల ప్రకారం ప్రతి నాలుగు వారాలకు ఓ సారి నీరవ్ మోదీ కోర్టుకు హాజరు కావాల్సివుంటుంది. ఆమేరకు జూలై 29కి ముందు మరో విచారణకు నీరవ్ మోదీ హాజరుకావాల్సి ఉంటుందని, అప్పు డే నీరవ్ అప్పగింతకు సంబంధించిన ట్రయల్‌కు కాలపరిమితి నిర్ణయం జరుగుతుందని భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) భావిస్తోంది. ఈ మేరకు జూలై 11లోపు నీరవ్ మోదీకి కేసుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సీపీఎస్ కోర్టుకు సమర్పించాల్సి వుంటుంది.