అంతర్జాతీయం

ఉగ్రవాద మూలాలను ఏరివేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒసాకా, జూన్ 28: ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు వారితో ఆర్థిక లావాదేవీలు సాగించే దుష్ట శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు కట్టుబడి ఉండాలని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలు పిలుపునిచ్చాయి. ఉగ్రవాద మూలాలను ఏరివేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో బ్రిక్స్ దేశాలు కోరాయి. దీనికి అంతర్జాతీయ సమాజ సహకారం కూడా అవసరమైతే పొందాలని పేర్కొన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఇంటర్నెట్‌ను దుర్వినియోగం చేసే శక్తులపై నిఘా పెంచాలని కూడా జీ-20 శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో బ్రిక్స్ దేశాల నేతలు కోరారు. ‘బ్రిక్స్ దేశాల్లో టెర్రరిస్టు దాడులను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఎక్కడ, ఎవరు ఈ కార్యకలాపాలకు పాల్పడినా, ప్రోత్సహించినా ఉపేక్షించబోం’ అని ఆయా దేశాల నేతలు పేర్కొన్నారు. ‘ఉగ్రవాద మూలాలను సమూలంగా ఏరివేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకొంటున్నామని’ బ్రిక్స్ నేతలు చెప్పారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదానికి ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సహా ఐదు బ్రిక్స్ దేశాల నేతలు తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఉగ్రవాదులకు ఆర్థిక సహకారాన్ని అందించే ఎలాంటి శక్తులనైనా అరికట్టేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకొనేందుకు కట్టుబడి ఉంటామని, దీనికి అంతర్జాతీయ సహకారం అవసరమైతే తీసుకొంటామని స్పష్టం చేశారు. ఆయా దేశాల ప్రజల రక్షణకు, భద్రతకు అవసరమైన సమాచార సాంకేతికతను వినియోగించుకొంటామని చెప్పారు. దీనికి ఆయా టెక్నాలజీ కంపెనీలు కూడా సహకరించాలని వీరు కోరారు. ఆయా దేశాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి నిర్మూలనకు నిబద్ధతతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు అవసరమైతే ఆస్తుల రికవరీకి ఆయా దేశాలు పరస్పర సహకారాన్ని అందించుకోవాలని వీరు పిలుపునిచ్చారు.