అంతర్జాతీయం

భారత్, పాక్ మధ్య అణు యుద్ధం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఆగస్టు 8: భారత్,పాకిస్తాన్ దేశాల మధ్య అణు తప్పదని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ వెల్లడించాడు. కాశ్మీర్ అంశమే ఇరుదేశాల మధ్య యుద్ధానికి దారితీసుకుందని సోమవారం ఇక్కడ తెలిపాడు. ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కాశ్మీర్ ప్రజలను పోరాడుతునే ఉంటారని హెచ్చరించాడు. అణచివేతకు గురవుతున్న కాశ్మీర్ ప్రజలకు విముక్తి కలిగించేందుకు సాయుధ జిహాదీ యుద్ధమే ఏకైక పరిష్కారమని సలాహుద్దీన్ ప్రకటించాడు.
చివరికి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య అణు యుద్ధానికి కాశ్మీర్ అంశమే కారణమవుతుందని హిజ్బుల్ నేత అన్నాడు. వివాదాస్పద కాశ్మీర్‌పై ఇరుదేశాల మధ్య ఇప్పటికే మూడు సార్లు యుద్ధాలు జరిగాయని, నాలుగోసారి అణు యుద్ధం అనివార్యమని జోస్యం చెప్పాడు. ‘అంతర్జాయ సమాజం మద్దతు ఇవ్వకపోయినా, పాకిస్తాన్ కాశ్మీరీయులకు అండతగా నిలబడకపోయినా, సమస్య పరిష్కారంలో ఐరాస విఫలమైనా కాశ్మీర్ ప్రజల విముక్తి పోరాటం సాగుతుంది’అని హిజ్బుల్ అధినేత హెచ్చరించాడు. చివరి రక్తపుబొట్టువరకూ ఆ ప్రజలు పోరాడతారని అతడు తెలిపాడు.
‘దేవుడు వారి పక్షాల లేకపోయినా, అంతర్జాతీయ సమాజం కాశ్మీర్ ప్రజల సమస్యలు పరిష్కారానికి చొరవతీసుకోకపోయినా, భారత్ అకృత్యాలు ఆపకపోయినా సరే ఓ పెద్ద సంఘటనే చోటుచేసుకుంటుంది’ని సలాహుదీన్ పేర్కొన్నాడు. కాశ్మీర్ ప్రజల విముక్తికోసం హిజ్బుల్ పోరాడుతుందని అతడు ప్రకటించాడు. సాయుధ జిహాదీ యుద్ధంతో తప్ప కాశ్మీర్ సమస్యకు, అక్కడి ప్రజలకు విముక్తి లభించదని అతడు పునరుద్ఘాటించాడు.