అంతర్జాతీయం

54 మిలియన్ డాలర్ల పెంట్‌హౌస్ కొనుగోలు చేసిన బ్రిటన్ బిలియనీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జూలై 10: బ్రిటన్‌కు చెందిన జేమ్స్ డైసన్ అనే బిలియనీర్ ఒక పెంట్‌హౌస్ కొనుగోలు చేసేందుకు ఏకంగా 54 మిలియన్ డాలర్లు వెచ్చించాడు. సింగపూర్‌లోనే అతి పెద్ద, ఖరీదైనదిగా గుర్తింపు పొందిన పెంట్‌హౌస్ మూడు ఫ్లోర్లు కలిగిన ఇంటి పైభాగాన రూఫ్‌టాప్ టెర్రస్, ప్రైవేట్ పూల్ ఉన్నాయి. ఈ వ్యాపారవేత్త సింగపూర్‌లో 21,000 చదరపు అడుగులు (1,960 చదరపు మీటర్లు) కలిగిన ‘సూపర్ పెంట్‌హౌస్’ను 54 మిలియన్లు వెచ్చించి కొనుగోలు చేసినట్టు సింగపూర్‌కు చెందిన బిజినెస్ టైమ్స్ దినపత్రిక తెలిపింది. ఈ పెంట్‌హౌస్‌ను వ్యాపారవేత్త జేమ్స్ డైసన్, అతని భార్య డైడ్రే ఉమ్మడిగా 99 సంవత్సరాలపాటు లీజు ప్రాతిపదికన తీసుకున్నట్టు ఆ పత్రిక పేర్కొంది. ఈ టెంట్‌హౌస్ గత నెల 20 సేల్ రిజిస్టర్ అయినట్టు తెలిపింది. 72 ఏళ్ల డైసన్ ఇప్పటికే సింగపూర్‌లో అత్యంత ఎతె్తైనది, లగ్జరీ హోమ్ అయిన వాలిచ్ రెసిడెన్సీలో ఆఖరి మూడు ఫ్లోర్లను కొనుగోలు చేశారు.