అంతర్జాతీయం

బంగ్లా మాజీ నియంత ఎర్షాద్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూలై 14: బంగ్లాదేశ్ మాజీ మిలటరీ నియంత హుస్సేన్ మహ్మద్ ఎర్షాద్ ఆదివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. వయస్సు పైబడడం, అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఆయనకు రెండో భార్య ద్వారా ఒక కుమారుడు, ఇద్దరు పెంపుడు కుమారులు ఉన్నారు. జతియా పార్టీ చీఫ్‌గా, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న ఎర్షాద్ అస్వస్థతకు గురి కావడంతో గత నెల 22న కంబైన్డ్ మిలటరీ ఆసుపత్రి (సీఎంహెచ్)లో చేర్పించారు. అప్పటి నుంచి ఐసీయూలోనే చికిత్స పొందుతున్న ఎర్షాద్ ఆదివారం ఉదయం 7.45 గంటలకు తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. తొమ్మిది రోజులుగా శరీరంలోని ముఖ్యమైన భాగాలు పని చేయకపోవడంతో, ఆరోగ్యం మరింత క్షీణించినట్లు చెప్పారు. శుక్రవారం వరకూ స్పందించే వారని, శనివారం నుంచి స్పందించలేదని, కంటి రెప్పలు కూడా కదల్చలేదని డాక్టర్లు వివరించారు. ఇలాఉండగా ఎర్షాద్ 1930 సంవత్సరంలో కూచ్‌బెహర్ జిల్లా సబ్-డివిజన్‌లోని దిన్‌హతాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌కు వలస వచ్చారు.
పలువురి సంతాపం: ఎర్షాద్ చిన్న సోదరుడు, జతియా పార్టీ నాయకుడు జీఎం ఖదార్ మీడియాతో మాట్లాడుతూ దేశాధ్యక్షడు అబ్దుల్ హమీద్, ప్రధాని షేక్ హసీనా, స్పీకర్ డాక్టర్ శిరిన్ షర్మిన్ చిద్యుయ్ ప్రభృతులు ఎర్షాద్ మృతి పట్ల సంతాపం తెలిపారని, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారని చెప్పారు.
కేంద్ర మంత్రి సంతాపం
ఎర్షాద్ మృతి పట్ల భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య మైత్రి బంధాన్ని పెంపొందించడంలో ఆయన ఎంతో కృషి చేశారని జైశంకర్ ట్వీట్ చేశారు.