అంతర్జాతీయం

దోశ వేసిన బ్రిటన్ యువరాజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 11: దక్షిణ భారత దేశంలోని ప్రసిద్ధ వంటకాల్లో ఒకటైన దోశపై బ్రిటన్ యువరాజు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ ముచ్చటపడ్డారు. స్వహస్తాలతో దోశలు వేసుకుని వాటిని ఆరగించారు. ముంబయిలో సోమవారం టెక్ రాకెట్‌షిప్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం వారు ఈ సరదా తీర్చుకున్నారు. బెంగళూరుకు చెందిన స్టార్టప్ రూపొందించిన దోశల తయారీ పరికరం (దోశమ్యాటిక్)లో విలియమ్ పిండిని వేయగా, ఆ తర్వాత కేట్ మిడిల్టన్ కొన్ని మీటలు నొక్కి దానిని ప్రారంభించారు. దీంతో నిమిషం తిరక్కుండానే ఆ పరికరం నుంచి కరకరలాడే దోశ బయటికి వచ్చింది. యువరాజు విలియం ఆ దోశలో చిన్న ముక్కను తీసుకుని రుచి చూశారు. అనంతరం వారు ‘నమస్తే ముంబయి’ అంటూ ఈ దోశను రుచి చూపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. బ్రిటిష్ రాజకుటుంబీకులు బహిరంగ ప్రదేశాల్లో ఆహారాన్ని స్వీకరించరని, అయితే ప్రస్తుతం విలియమ్, కేట్ అందరి సమక్షంలో దోశను ఆరగించి ఆ సాంప్రదాయానికి తెర దించారని వారి గురించి తెలిసినవారు చెబుతున్నారు.

చిత్రం న్యూఢిల్లీలో మహాత్మా గాంధీ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పిస్తున్న
బ్రిటన్ యువరాజు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్