అంతర్జాతీయం

ఆధిపత్యమే.. తిరుగుబాటు ఉండదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 17: పాకిస్తాన్‌లో శక్తివంతమైన సైన్యం ప్రజా ప్రభుత్వాన్ని దించేయడానికి ఇప్పు డు సిద్ధంగా లేదని, అయితే ప్రభుత్వంపై తన ఆధిపత్యం స్థితిని కొనసాగిస్తోందని అమెరికా నిపుణులు అంటున్నారు. ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రషీద్ లతీఫ్ వారసుడి ఎంపిక చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో అమెరికా నిపుణులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. పాకిస్తాన్‌లో హటాత్తుగా ప్రభుత్వం మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని , ఎందుకంటే సైన్యం ప్రజా ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా లేదని గతంలో పాక్‌లో అమెరికా రాయబారిగా పని చేసిన రాబిన్ రాఫెల్ అభిప్రాయ పడ్డారు. పాకిస్తాన్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని ఇటీవల జరిగిన ఓ సెమినార్‌లో విశే్లషించిన వారిలో అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణాసియా వ్యవహారాల మాజీ సహాయ మంత్రి సహా దాదాపు అరడజను మంది నిపుణులు ఉన్నారని ప్రముఖ పాక్ దినపత్రిక ‘డాన్’ బుధవారం తెలిపింది. సెమినార్‌లో మాట్లాడిన వారంతా ప్రస్తుత ప్రభుత్వం బలహీనతలు, బలం, శక్తిమంతమైన పాక్ సైన్యంతో ప్రభుత్వం సంబంధాలు ఎలా ఉన్నాయనే అంశాలను విశే్లషించారు. సైన్యం ప్రభుత్వంపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది కానీ ప్రభుత్వాన్ని కూల్చి వేయదనే విషయాన్ని సెమినార్‌లో పాల్గొన్న వారంతా అంగీకరించడం గమనార్హం. పాక్ సైన్యం మధ్యంత ఎన్నికలను కోరుకోవడం లేదని రాఫెల్ అన్నారు. అమెరికాలో పాక్ సానుభూతి పరుల్లో ఒకరైన రాఫెల్‌కు పాక్ దౌత్యవేత్తలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఇటీవల ఎఫ్‌బిఐ దర్యాప్తు కూడా జరిపి క్లీన్‌చిట్ ఇచ్చింది. ఒక వేళ ఇప్పుడు ఎన్నికలు జరిగితే లాభపడేది ప్రతిపక్ష నాయకుడైన ఇమ్రాన్ ఖానే అవుతారని ఆమె అంటూ, అయితే ఎన్నికలు నిర్ణీత సమయమైన 2018లోనే జరగవచ్చని అభిప్రాయ పడ్డారు. దేశంలో పెద్దఎత్తున శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు మాత్రమే సైన్యం రంగంలోకి దిగవచ్చని కూడా ఆమె అన్నారు. అయితే ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు.