అంతర్జాతీయం

భూకంప మృతులు 247మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్యూమోలీ, ఆగస్టు 25: ఇటలీలో భూకంపంలో చనిపోయిన వారి సంఖ్య 274కి చేరుకుంది. మధ్య ఇటలీలో బుధవారం సంభవించిన భూకంపం తీవ్ర నష్టాన్ని కలగచేసింది. ప్రాణ, ఆస్తినష్టం అపారంగా ఉంది. పర్వత ప్రాంత గ్రామాల్లో భూకంపానికి ప్రాణనష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల తొలగింపునకు సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికి చనిపోయినవారి సంఖ్య 247కు చేరుకుంది. వందలాది మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. కూలిపోయిన భవనాల కింద ఇంకా అనేక మంది చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. శిథిలాల కింద ఉండిపోయినవారిని రక్షించేందుకు డజన్లకొద్దీ ఎమర్జెన్సీ టీమ్‌లు, సహాయక బృందాలు, వాలంటీర్లు ప్రయత్నిస్తున్నారు. భూకంపానికి తీవ్రంగా నష్టపోయిన అమట్రేస్‌లో ఇటలీ ప్రధాని మట్టెయో రెంజీ పర్యటించారు. ప్రాణనష్టం ఎక్కువగా ఉందన్న భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. భీకర భూకంపంతో జనం పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంది. బుధవారం రాత్రంగా జనం గజగజలాడే చలిలోనే గడిపారు. ఇళ్లనుంచి బయటకు వచ్చిన జనం గుడారాలు ఏర్పాటు చేసుకుని తలదాచుకున్నారు. ఎప్పుడేం ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయంతో ఇళ్లకు తిరిగి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. రెక్టార్ స్కేల్‌పై 6.0 నుంచి 6.2 డిగ్రీల తీవ్రతతో వచ్చిన భూకంపానికి ఎన్నో భవనాలు నేలమట్టమయ్యాయి.

చిత్రం..భూకంప బాధితులకోసం ఇటలీలోని ఓ గ్రామంలో తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసిన దృశ్యం