అంతర్జాతీయం

‘ఐఎస్’ అంతు చూస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, ఆగస్టు 19: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని అణచివేసి, స్థావరాలను ధ్వంసం చేస్తామని ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రతిజ్ఞ చేశారు. ఆఫ్గనిస్తాన్ 100వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జాతిని ఉద్దేశించి అధ్యక్షుడు ప్రసంగించారు. శనివారం రాత్రి దేశ రాజధాని కాబూల్ బాంబు పేలుళ్లతో కంపించిపోయింది. చిన్నారులతో కలిపి 63 మంది మరణించారు. కనీసం 200 మంది గాయపడ్డారు. షియా ముస్లిం మైనారిటీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఎస్ మానవ బాంబు ఈ విస్ఫోటనం సృష్టించాడు. కళ్యాణ మండపం వద్ద జనం నృత్యం చేస్తుండగా మధ్యలోకొచ్చి ఆత్మాహుతి బాంబు మారణహోమం సృష్టించింది. బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఐఎస్ అనుబంధ సంస్థ ప్రటించుకుంది. పెండ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అదృష్టవశాత్తూ పేలుళ్ల నుంచి తప్పించుకున్నారు. వరుడు మిర్వైసీ అలానీ స్థానిక వార్తా చానల్‌తో మాట్లాడుతూ బీభత్సకాండపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సెకన్లలోనే ఉపద్రం ముంచుకొచ్చిందని, బంధువులు అనేక మంది చనిపోయారని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. పేలుడు సంబవించిన వెంటనే టిలిబన్ గ్రూప్ ఓ ప్రకటన చేస్తూ దాడి జరుగుతుందని అమెరికా ఎందుకు పసిగట్టలేకపోయిందని నిలదీసింది. కాగా తాలిబన్‌లు ఉగ్రవాదం చర్యలను ప్రోత్సహిస్తున్నారని అధ్యక్షడు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఉగ్రవాదంపై మా పోరాటం కొనసాగుతుంది. వారిని అంతం చేసే వరకూ విశ్రమించేదిలేదు’అని అధ్యక్షుడు ఘనీ సోమవారం ప్రకటించారు. ఐఎస్ ఉగ్రమూకలపై ప్రతికారం తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదంపై జరిగే యుద్ధంలో ప్రపంచ దేశాలు భాగస్వాములు కావాలని, తమకు సహకరించాలని ఆయన అభ్యర్థించారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద స్థావరాలకు అలవాలంగా మారిందని ఆయన విమర్శించారు. ఇలా ఉండగా శనివారం రాత్రి కాబూల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగానే స్పందించారు. దాడులకు ఆఫ్గనిస్తాన్ ప్రయోగశాల కాదని అన్నారు. ఆఫ్గన్‌కు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ సందేశం పంపారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఐఎస్ చర్య మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.