అంతర్జాతీయం

సెప్టెంబర్ 19వరకు నీరవ్ మోదీ రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 22: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను మోసగించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి పారిపోయి, ప్రస్తుతం లండన్ జైలులో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని గురువారం వీడియో లింక్ ద్వారా బ్రిటన్‌లోని ఒక కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు మోదీ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 19వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పీఎన్‌బీని రెండు బిలియన్ డాలర్ల మేరకు ముంచి పరారయిన నీరవ్ ని స్వదేశానికి తీసుకు రావడానికి భారత్ ప్రయత్నిస్తోంది. న్యాయమూర్తి టాన్ ఇక్రం నేతృత్వంలోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి సంబంధించిన కేసు ‘కాల్-ఓవర్’ విచారణ జరిగింది. నీరవ్ మోదీ విచారణ తేదీలను సెప్టెంబర్ 19వ తేదీన జరిగే తరువాత ‘కాల్ ఓవర్’ హియరింగ్ సందర్భంగా ఖరారు చేస్తామని అతనికి జడ్జి టాన్ ఇక్రం తెలిపారు. సెప్టెంబర్ 19న మళ్లీ నీరవ్ మోదీని వీడియోలింక్ ద్వారానే కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. ‘ఈ రోజు ఎలాంటి పురోగతి లేదు’ అని జడ్జి పేర్కొన్నారు. 2020 మే 11వ తేదీ నుంచి మొదలయ్యే నీరవ్ మోదీ అప్పగింత అయిదు రోజుల విచారణ తేదీలను ధ్రువీకరించాలని కోర్టు క్లర్క్‌ను జడ్జి ఆదేశించారు.