అంతర్జాతీయం

కర్తార్‌పూర్ కారిడార్‌పై మరోసారి భారత్-పాక్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్ / గుర్దాస్‌పూర్, ఆగస్టు 30: భారత్-పాకిస్తాన్‌లను కలుపుతూ నిర్మించే కర్తార్‌పూర్ కారిడార్‌పై ఇరు దేశాల అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. కాశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించి ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసిన తరువాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తరువాత మొట్టమొదటిసారిగా ఇరు దేశాల సరిహద్దులోని జీరో పాయింట్ వద్ద ఈ సమావేశం జరిగింది. రెండు దేశాల తరఫున చెరో 15మంది అధికారులు హాజరై ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతికపరమైన అంశాలపై చర్చించినట్లు సమాచారం. సిక్కుల పవిత్ర స్థలమైన పాకిస్తాన్ గుర్దాస్‌పూర్ జిల్లాలో ఉన్న కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ వద్దకు భారత్‌కు చెందిన సిక్కు భక్తులు వీసా లేకుండా ప్రయాణించేందుకు వీలుగా ఈ కారిడార్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కారిడార్ నిర్మాణాన్ని ఇరు దేశాలూ వారి వారి పరిధిలో కొనసాగిస్తున్నాయి. దాదాపు రెండు గంటల పాటు ఇరు దేశాల అధికారులు సమావేశమైనట్లు భారత జాతీయ రహదారుల అథారిటీ అధికారి ఒకరు తెలియజేశారు. పాకిస్తాన్ వైపునుంచి సమావేశానికి సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదు. పైగా సమావేశానికి ఇరు దేశాల మీడియాను అనుమతించకపోవడం గమనార్హం. గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకొని కర్తార్‌పూర్ కారిడార్‌ను నవంబర్ నెలలో ప్రారంభించనున్నట్లు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ గురువారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కారిడార్‌కు సంబంధించి ఇరువైపుల అధికారులు అలైన్‌మెంట్, సమన్వయం, ఇంజనీరింగ్ అంశాలపై ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు. జూలై నెలలో కూడా దీనిపై వాఘా సరిహద్దులో ఇరుదేశాల అధికారులు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. భారత సరిహద్దు నుంచి గురుద్వారా దర్బార్ సాహిబ్ వరకు కారిడార్‌ను పాక్ నిర్మిస్తుండగా.. పంజాబ్‌లోని డేరాబాబా నానక్ నుంచి సరిహద్దు వరకు భారత్ నిర్మిస్తోంది.