అంతర్జాతీయం

రష్యాలోని ‘ఫార్ ఈస్ట్’కు బిలియన్ డాలర్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్లాడివోస్తోక్, సెప్టెంబర్ 5: భారత్ గురువారం అసాధారణ రీతిలో రష్యాలోని సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఫార్ ఈస్ట్ ప్రాంతానికి ఒక బిలియన్ డాలర్ల రుణం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఫార్ ఈస్ట్ ప్రాంత అభివృద్ధి కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్న బ్రహ్మాండమయిన కృషికి మద్దతిస్తానని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో గురువారం ఇక్కడ జరిగిన ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం (ఈఈఎఫ్) అయిదో ప్లీనరీ సెషన్‌లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ మరో దేశంలోని ఒక ప్రాంతానికి ఇలాంటి ప్రత్యేక రుణాన్ని ప్రకటించడం అపూర్వమయిన విషయమని అన్నారు. ‘్భరత్ ఫార్ ఈస్ట్ అభివృద్ధి కోసం ఒక బిలియన్ డాలర్ల విలువ గల రుణాన్ని (లైన్ ఆఫ్ క్రెడిట్) ఇస్తుంది. ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో భాగంగా నా ప్రభుత్వం తూర్పు ఆసియాతో క్రియాశీలకంగా కలిసి పనిచేస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. రష్యాలోని చమురు, సహజ వాయువు, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఫార్ ఈస్ట్ రీజియన్‌తో భారత్ కలిసి పనిచేయడాన్ని తీవ్రం చేయడానికి తన ప్రభుత్వం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఫార్ ఈస్ట్’ విధానాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ‘మా మిత్ర దేశాలలోని రీజియన్ల మధ్య ఆర్థిక దౌత్యాన్ని, వృద్ధి బంధాలను పెంపొందించడానికి ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను’ అని మోదీ అన్నారు.

చిత్రం...వ్లాడివోస్తోక్‌లో గురువారం జరిగిన ఐదవ తూర్పు ఆర్థిక ఫోరంలో మాట్లాడుతున్న భారత ప్రధాని మోదీ. రష్యా అధ్యక్షుడు పుతిన్, జపాన్ ప్రధాని షింజో అబే, మంగోలియా అధ్యక్షుడు, మలేసియా ప్రధానిని కూడా చిత్రంలో చూడవచ్చు.