అంతర్జాతీయం

27న ఐరాసలో మోదీ ప్రసంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 9: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 27 నుంచి దాదాపు వారం రోజులపాటు న్యూయార్క్‌లోనే గడుపుతారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమావేశానికి హాజరవుతున్న మోదీ వారం రోజులపాటు వివిధ దేశాల నేతలతో చర్చోప చర్చల్లో తలమునకలవుతారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో ఎవరెవరు మాట్లాడతారన్న దానిపై తాజా వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈనెల 27న ఓ ఉన్నత స్థాయి సమావేశంలో మోదీ మాట్లాడతారని తెలుస్తోంది. భారత్‌లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐరాస వేదికపై మోదీ ప్రసంగించబోవడం ఇదే మొదటిసారి. 2014లో తొలిసారిగా ఐరాసలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఈనెల 27వ తేదీన ఐరాసలో మాట్లాడతారు. మోదీ ప్రసంగం ముగిసిన తర్వాతే ఇమ్రాన్ ఖాన్ మాట్లాడతారని తాజా వివరాల ప్రకారం తెలుస్తోంది. ఐరాసలో వివిధ అంశాలపై జరిగే చర్చల్లో 112 మంది దేశాధినేతలు, 48 మంది ప్రభుత్వ అధినేతలు, 30 మంది విదేశాంగ మంత్రులు పాల్గొంటారు. ఈనెల 24 నుంచి మొదలయ్యే ఈ చర్చ 30వ తేదీ వరకు సాగుతుంది. 24న జరిగే ఉన్నత స్థాయి సమావేశం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడతారు. వారం రోజుల పాటు మోదీ తలమునకలు లేకుండా న్యూయార్క్‌లో గడుపుతారని ఆయన సమావేశాల షెడ్యూల్ బట్టి స్పష్టమవుతోంది. వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక, త్రిముఖ చర్చల్లో మోదీ పాల్గొంటారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డును మిలిందా గేట్ ఫౌండేషన్ నుంచి అందుకుంటారు.