అంతర్జాతీయం

వాతావరణ మార్పులు నిరోధించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్‌బెర్రా, సెప్టెంబర్ 20: వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వాతావరణ మార్పుకు కారణమవుతున్న గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను తగ్గించాలని వారు ముక్తకంఠంతో నినదించారు. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) శిఖరాగ్ర సమావేశాలు న్యూయార్క్‌లో జరుగనున్న తరుణంలో శుక్రవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు వివిధ దేశాలలో లక్షలాది మంది ప్రజలు స్పందించి ర్యాలీలలో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఆస్ట్రేలియాలో అతి పెద్ద నగరం సిడ్నీ, దేశ రాజధాని కాన్‌బెర్రాలో ‘గ్లోబల్ క్లైమేట్ స్ట్రైక్’ పేరిట భారీ ప్రదర్శనలు నిర్వహించారు. బొగ్గు, ద్రవ సహజ వాయువు ఎగుమతుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద దేశమయిన ఆస్ట్రేలియా గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి మరింత కఠినమయిన చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రజలు ర్యాలీలలో డిమాండ్ చేశారు. మూడు లక్షలకు పైగా మంది ఆస్ట్రేలియా ప్రజలు ఈ ర్యాలీలలో పాల్గొన్నారని నిర్వాహకులు అంచనా వేశారు. 2003లో ఇరాక్ యుద్ధం మొదలయినప్పటి నుంచి ఆస్ట్రేలియాలో ఇంత భారీ ప్రదర్శనలు జరగడం ఇదే మొదటిసారని వారు పేర్కొన్నారు. ఇతర దేశాల్లోనూ ఇలాంటి ర్యాలీలు శుక్రవారం జరిగాయి. అమెరికాలో 800 కార్యక్రమాలు నిర్వహించాలని, జర్మనీలో 400కు పైగా ర్యాలీలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ప్రపంచంలోని అత్యంత కాలుష్యమయిన నగరాలలో ఒకటయిన ఢిల్లీలో వందలాది మంది విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు శుక్రవారం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం వెలుపల ప్రదర్శన నిర్వహించారు. ‘వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా చర్య తీసుకోండి’, ‘మేము స్వచ్ఛమయిన గాలిని పీల్చుకోవాలి’ అంటూ వారు నినదించారు.
థాయిలాండ్‌లో ప్రజలు ‘కైమేట్ ఎమర్జెన్సీ’ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాంకాంగ్‌లో ప్రజలు ‘కాలుష్యాన్ని ఆపండి’ అంటూ నినదించారు. ఆస్ట్రేలియాలోని 110 పట్టణాలు, నగరాలలో శుక్రవారం వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.