అంతర్జాతీయం

ఫ్రాన్స్ పర్యటన ఫలవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 10: ఫ్రాన్స్‌లో తన పర్యటన విజయవంతమైందని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 36 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో భాగంగా, మొదటి రాఫెల్ విమానాన్ని అధికారికంగా స్వీకరించడానికి వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటనను ముగించుకున్నారు. స్వదేశానికి బయలుదేరే ముందు ఆయన వీడ్కోలు మెసేజ్‌ను ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్, రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆతిథ్యాన్ని ఎన్నడూ మరువలేనని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలు భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌లో పెట్టుబడులకు తరలిరావాల్సిందిగా ఆయన ఫ్రెంచ్ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ (జీఎస్‌టీ)ని అమలు చేయడం ద్వారా ఇప్పుడు భారత్‌లో ఒకే పన్ను విధానం ఉందన్నారు. భారత్‌లో విస్తారమైన మార్కెట్ ఉందని, పెట్టుబడులకు ఇదే సరైన సమయమని తెలిపారు. భారత్‌లో జరిగే డిఫెన్స్ ఎగ్జిబిషన్స్‌లో ఫ్రెంచ్ సంస్థలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నాయని అన్నారు. ఇది తనకు ఎంతో ఆనందాన్నిస్తున్న విషయమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. 2020 జరిగే డిఫెన్స్ ఎగ్జిబిషన్‌లోనూ అదే రీతిలో పాల్గొనాల్సిందిగా ఆయా సంస్థలను కోరారు. ఫ్రాన్స్‌తో శాశ్వత మైత్రీ సంబంధాలను భారత్ కోరుతున్నదని అన్నారు.
*చిత్రం... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్