అంతర్జాతీయం

బూడిదైన బంగ్లా ఫ్యాక్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, సెప్టెంబర్ 10: బంగ్లాదేశ్‌లోని ఓ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి 26మంది చనిపోయారు. 74మంది కాలిన గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉత్తర ఢాకాలోని టోంగి ఇండస్ట్రియల్ ఏరియాలోని టెంపకో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం ఆరుగంటల సమయంలో బాయిలర్ పేలడంతో ప్రమాదం సంభవించినట్టు ఘాజీపూర్ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ అఖ్తరుజ్జమాన్ చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి విశ్వప్రయత్నం చేసినప్పటికీ, మంటలు నాలుగంతస్తుల భవనం అంతటికీ వ్యాపించడంలో భవనంలో కొంతభాగం కూలిపోయిందని చెప్పారు. సంఘటనలో 26మంది మృతి చెందగా, 74మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారన్నారు. 19 మృతదేహాలు ప్రస్తుతం టోంగి ఆస్పత్రిలో ఉన్నాయని, ఐదు మృతదేహాలు ఢాకా మెడికల్ కాలేజి ఆస్పత్రిలో, మరో రెండు మృతదేహాలు ఆధునిక్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఉన్నట్టు అధికారులు చెప్పారు. గాయపడిన వారిలో 30మందిని ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి, మరో పదిమందిని కుమిటోలా ఆస్పత్రికి తరలించామన్నారు. క్షతగాత్రుల్లో పదిమంది మృత్యువుతో పోరాడుతున్నట్టు అధికారులు చెప్పారు. 25 అగ్నిమాపక బృందాలు మంటలను అదుపు చేయడానికి శ్రమిస్తున్నాయి. ప్రమాదం సంభవించిన ఆరు గంటల తరువాత కూడా పెద్దఎత్తున మంటలు, దట్టమైన పొగలు ఫ్యాక్టరీ లోపలినుంచి ఎగసిపడుతుండటం కనిపిస్తోంది. బలమైన ఈదురు గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. సంఘటనపై దర్యాప్తు జరపడానికి గాజిపూర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రెహనుల్ ఇస్లాం నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు.