అంతర్జాతీయం

రండి..అందుకోండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెసిలియా: పెట్టుబడులకు, వ్యాపారానుకూల పరిస్థితులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఐదు బ్రిక్స్ దేశాల వ్యాపారవేత్తలను ఉద్దేశించి గురువారం ఇక్కడ మాట్లాడిన మోదీ ‘ భారత్‌లో హద్దులేని అవకాశాలున్నాయి.. అనంతమైన పెట్టుబడులకు వీలుంది.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తరలిరండి..’ అని పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు అలుముకున్నప్పటికీ బ్రిక్స్ కూటమిలోని ఐదు సభ్యదేశాలు నిలకడైన అభివృద్ధిని సాధించాయని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.
భారతదేశంలో రాజకీయ సుస్థిరత, స్పష్టమైన విధానాలు, వ్యాపారానుకూల సంస్కరణలు అమలుతున్నాయని.. అన్ని విధాలుగా అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్‌ను అత్యంత అనుకూలమైన దేశంగా తీర్చిదిద్దామని మోదీ తెలిపారు. 2024 నాటికి భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని పేర్కొన్న మోదీ.. ఈ లక్ష్యానికి చేరువ కావాలంటే నిర్మాణ రంగంలోనే 1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని తెలిపారు. భారత్ అందిస్తున్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని.. తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని బ్రిక్స్ దేశాల వ్యాపారవేత్తలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో ఈ ఐదు దేశాల వాటానే 50 శాతం వరకు ఉందని పేర్కొన్న మోదీ.. మాంద్యం ప్రభావం లేకుండా ఈ దేశాలు ఆర్థిక వృద్ధిని నమోదు చేసుకున్నాయని.. పేదరిక నిర్మూలనలో విజయం సాధించాయని.. టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణల్లోనూ సరికొత్త విజయాలను నమోదు చేసుకున్నాయని మోదీ తెలిపారు. బ్రిక్స్ కూటమి మొదలై పదేళ్లు దాటిందన్న విషయాన్ని ప్రస్తావించిన మోదీ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ఐదు దేశాలు ఉమ్మడిగా తమ భవిష్యత్ వ్యూహాన్ని రూపొందించుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ సభ్య దేశాలు అంతర్గతంగా తమ వ్యాపార నియమ నిబంధనలను సరళతరం చేస్తే పరస్పర వాణిజ్యం పెట్టుబడులు వాటంతట అవే పెరుగుతాయని అన్నారు. ఈ దేశాల మధ్య పన్నులు, సుంకాలకు సంబంధించిన విధివిధానాలు కూడా సరళతరం అవుతున్నాయని.. అలాగే మేథోసంపత్తి హక్కులు.. బ్యాంకుల మధ్య పెరుగుతున్న సహకారం వల్ల వ్యాపార వాతావరణం అనుకూలంగా మారుతోందని తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బ్రిక్స్ సభ్యదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు తమ భవిష్యత్ వ్యూహాలను రూపొందించుకోవాలన్నారు. ముఖ్యంగా రానున్న పదేళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ సభ్యదేశాలు ప్రాధాన్యతా రంగాలను గుర్తించి వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేయాలన్నారు. ఈ సభ్య దేశాల్లో ఒకటి టెక్నాలజీ రంగంలోనూ.. మరో దేశం ముడి పరికరాలు, మార్కెట్ రంగంలోనూ ఇలా ప్రతి దేశంలో ఏదో ఒక రంగంలో ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటే అన్ని రకాలుగానూ సమష్టిగా సహకరించుకుని, సమగ్ర వృద్ధిని సాధించవచ్చునని అన్నారు. ఈ కూటమి సభ్య దేశాల్లో ప్రతిభ, సృజన, కష్టపడి పనిచేసే ప్రజలు ఉన్నారని.. ఇదే భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాది అని మోదీ స్పష్టం చేశారు.
ప్రైవేటు రంగాలు కూడా బ్రిక్స్ ఉమ్మడి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చిన మోదీ యువ పారిశ్రామికవేత్తలకు కూడా తగిన రీతిలో ప్రోత్సాహాన్ని ఇవ్వడం వల్ల వ్యాపారం, సృజన వంటివి కొత్త శక్తిని పుంజుకుంటాయన్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఈ కూటమి దేశాల్లో టూరిజం, వ్యాపారం, ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా ఉన్నాయని తెలిపారు. తమ దేశంలోని భారతీయులకు వీసా లేకుండా అనుమతిస్తామని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో తీసుకున్న నిర్ణయం పట్ల మోదీ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.
*చిత్రం...బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మాట్లాడుతున్న మోదీ