అంతర్జాతీయం

పాక్‌కు చైనా అండ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, సెప్టెంబర్ 24: పాకిస్తాన్‌పై ఒకవేళ ఎవరైనా బయటివారు దాడి చేసినట్లయితే తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా ఆ దేశానికి హామీ ఇచ్చింది. అంతేకాదు కాశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని సైతం చైనా సమర్థించిందని పాక్ మీడియా కథనం పేర్కొంది. లాహోర్‌లో చైనా కాన్సుల్ జనరల్ యు బోరేన్ శుక్రవారం పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్‌తో భేటీ అయిన సందర్భంగా ఈ హామీ ఇచ్చినట్లు పాక్ దినపత్రిక ‘డాన్’ తెలిపింది. ‘ఒక వేళ బయటివారెవరైనా దాడి చేసినట్లయితే మా దేశం పాక్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తుంది’ అని యు బోరేన్ అన్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటన పేర్కొంది. ‘కాశ్మీర్ సమస్యపై పాక్ వైఖరిని మేము సమర్థించాం, సమర్థిస్తూనే ఉంటాం. భారత్ అధీనంలోని కాశ్మీర్‌లో నిరాయుధులైన కాశ్మీరీలపై జరుగుతున్న దారుణాలు ఏ విధంగాను సమర్థనీయం కాదు. కాశ్మీర్ సమస్యను కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కరించాలి’ అని యు అన్నట్లు ఆ ప్రకటన తెలిపింది. షాబాజ్ షరీఫ్ 65వ జన్మదినం సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేయడానికి యు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కాశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాల గురించి, చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ కింద అమలు జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల గురించి ఆయన షాబాజ్‌తో చర్చించారు. ఈ ఆర్థిక కారిడార్‌లో కొంతభాగం వివాదాస్పద ప్రాంతం గుండా వెళ్తుండడంతో భారత్ ఈ ప్రాజెక్టుపై గతంలోనే అభ్యంతరాలు తెలియజేయడం తెలిసిందే.