అంతర్జాతీయం

ఒక్క ముద్దు ప్లీజ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/న్యూయార్క్, అక్టోబర్ 8: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీపడుతున్న ప్రముఖ వ్యాపార దిగ్గజం డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2005 సంవత్సరంలో ట్రంప్ ఒక మహిళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్యకరమైన రీతిలో మాట్లాడిన వీడియో వెలుగులోకి రావడమే ఇందుకు కారణం. దీనిపై అమెరికాలో దుమారం రేగడంతో ట్రంప్ తన నిర్వాకానికి బలవంతంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
‘నేను నిన్ను ముద్దు పెట్టుకుంటా, ఇక ఆగలేను, ఒకే ఒక్క ముద్దు...’ అంటూ ట్రంప్ (70) సదరు మహిళతో అసభ్యంగా మాట్లాడుతూ దొరికిపోయిన వీడియో ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక చేతికి చిక్కింది. బిల్లీ బుష్ అనే మహిళతో ట్రంప్ పైవిధంగా మాట్లాడుతూ ఈ వీడియోలో పట్టుబడ్డాడు.
ఇదిలావుంటే, ట్రంప్ నికర సంపద గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 800 మిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో ఆయన అమెరికాలోని శ్రీమంతులతో ప్రముఖ పత్రిక ‘్ఫర్బ్స్’ విడుదల చేసిన తాజా జాబితాలో 35 స్థానాలు కిందికి దిగజారాడు. గత ఏడాది అక్టోబర్ నాటికి 4.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ట్రంప్ నికర ఆస్తి ఈ ఏడాది అక్టోబర్ నాటికి 800 మిలియన్ డాలర్లు తగ్గి 3.7 బిలియన్ డాలర్లకు పడిపోయిందని, దీంతో ఆయన అమెరికాలోని టాప్-400 శ్రీమంతుల జాబితాలో 121వ ర్యాంకు నుంచి 35 స్థానాలు కిందికి దిగజారి 156వ ర్యాంకుకు పతనమయ్యారని ‘్ఫర్బ్స్’ పత్రిక వెల్లడించింది.